యాచకురాలిపై లైంగికదాడి..హత్య | PD Act Caser File in Molestation And Murder Case | Sakshi
Sakshi News home page

రేపిస్ట్‌లపై ‘పీడీ’కిలి

Published Thu, Jan 24 2019 10:40 AM | Last Updated on Thu, Jan 24 2019 10:40 AM

PD Act Caser File in Molestation And Murder Case - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: యాచకురాలిపై లైంగికదాడికి పాల్పడి దారుణంగా హత్య చేసిన కేసులో ఇద్దరు కామాంధులపై సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ బుధవారం పీడీ యాక్ట్‌ ప్రయోగించారు.  బాలానగర్‌కు చెందిన కొండవీటి సాయికిరణ్, జీడిమెట్ల చింతల్‌లో ఉంటున్న మెదక్‌ జిల్లావాసి గజ్జగల్లా రాజులపై కఠిన చర్యలు తీసుకున్నారు. చెడు అలవాట్లకు బానిసలైన వీరు గతేడాది ఏప్రిల్‌ 9న అర్ధరాత్రి సమయంలో బలానగర్‌ హనుమాన్‌ మందిర్‌కు సమీపంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో మద్యం తాగి గంజాయి సేవించారు. అదే సమయంలో అక్కడ గుడిసెలో యాచకురాలు బోయిన లక్ష్మమ్మ(35), ఆమె తల్లి దుర్గమ్మ(75) నిద్రిస్తుండటాన్ని గమనించారు. వృద్ధురాలైన దుర్గమ్మను బెదిరించి లక్ష్మమ్మను తమ వెంట తెచ్చుకున్న గమ్‌ టేప్‌తో చేతులు వెనక్కి కట్టేసి అరవకుండా నోటికి  గమ్‌టేప్‌ వేసి ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడికి పాల్పడ్డారు. ముఖం, ముక్కుకు గమ్‌టేప్‌ ఉండటంతో శ్వాస అడక ఆమె మృతి చెందింది.

అయినా వారు ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. దీనిని ప్రత్యక్షంగా చూసిన అక్కడే ఉన్న ఐడీపీఎల్‌వాసి బెంగళూరు ఎయిర్‌ఫోర్స్‌ రిటైర్డ్‌ సిపాయి బాలా నర్సింగ్‌రావు నిందితులు సాయికిరణ్, రాజులు  వెళ్లిపోయిన అనంతరం అతను కూడా లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదుచేసిన బాలానగర్‌ పోలీసులు గతేడాది ఏప్రిల్‌ 23న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే యాచకురాలు చనిపోయిన తర్వాత కూడా ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన సీపీ సజ్జనార్‌ నిందితులు సాయికిరణ్, రాజులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. నిందితులు నేరాలు చేయాలంటే భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలోనే కొందరు రేపిస్ట్‌లపై పీడీ యాక్ట్‌లు ప్రయోగించినట్లు ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement