
PD Act Slapped On Actress Shalu Chourasiya Attack Case: సినీ నటి షాలు చౌరాసియాపై దాడి కేసులో నిందితుడిపై నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. గతేడాది నవబంర్‌లో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద నటి చౌరాసియా నడక పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా కొమ్మూరిల బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై దాడికి పాల్పడి షాలు చౌరాసియా పోన్ ఎత్తుకెళ్లాడు బాబు. ఈ దాడితోపాటు బాబుపై మరో మూడు కేసులు ఉండటంతో పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో బాబు శిక్ష అనుభవిస్తున్నాడు.
చదవండి: నటి చౌరాసియాపై దాడి: సీసీ కెమెరాలను తప్పించుకుతిరిగాడా?
మహబూబ్ నగర్ జిల్లా కుల్కచర్లకు చెందిన బాబు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు నాలుగున్నరేళ్ల క్రితం వచ్చాడు. సినిమాల్లో సెట్లు వేసే వారి వద్ద రోజు కూలీగా చేరాడు. సంపాదన సరిపోక రాత్రివేళల్లో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. కాగా 2021, నవంబర్ 14వ తేదీన సాయంత్రం పూట వాకింగ్ చేస్తున్న షాలూ చౌరాసియాపై బాబు దాడి చేసి తీవ్రంగా కొట్టి రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. ఆమె తన దగ్గర డబ్బులు లేవని పేటీఎం చేస్తానని చెప్పినా వినిపించుకోలేదు. బండరాయి పక్కన కిందకు తోసేసి ఆమెను తీవ్ర ఇబ్బందికి గురి చేశాడు. ఒక సందర్భంలో బండరాయిని ముఖంపై బాది హత్య చేసేందుకు కూడా యత్నించాడు. శక్తిని కూడదీసుకున్న చౌరాసియా తన మోచేతితో నిందితుడిపై దాడి చేసి ఫెన్సింగ్ దూకి బయటికి పరుగులు తీసింది.
చదవండి: సినీ నటి చౌరాసియాపై దాడి చేసిన నిందితుడిపై మరో కేసు
Comments
Please login to add a commentAdd a comment