
చంద్రగిరి: ఎర్రచందనం కేసులో ముద్దాయిగా ఉ న్న యల్లంపల్లి హరిబాబు అలియాస్ జబర్దస్త్ ఫేం హరిపై పీడీయాక్టు నమోదు చేసినట్లు చంద్రగిరి సీఐ ఈశ్వరయ్య తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం కేసులో ముద్దాయిగా పలు కేసులు ఉన్న హరిని జులై 17వ తేదీన తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ మేరకు అతన్ని పీటీ వా రెంట్‌పై కోర్టులో హాజరుపరచడంతో తిరుపతి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నట్లు తెలి పారు. కాగా హరిపై పీడీ యాక్టు నమోదు చేయాలని అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్నను కోరారు. కాగా కలెక్టర్ మంగళవారం పీడీ యాక్టును అమలు చేస్తూ.. ఆదేశాలు జారీ చేశారన్నా రు. ఈ మేరకు కడప జిల్లా కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఆయన తెలిపారు.