సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఓ మహిళ 2009 నుంచి దొంగతనాలు చేస్తోంది. అందరి కళ్ళు కప్పి తప్పించుకుని తిరిగసాగింది. చివరికి పోలీసులకు చిక్కింది. వివరాలివి.. నగరంలో బ్యూటీ ప్లారర్‌లో దొంగతనాలకు పాల్పడుతున్న డైసి అనే ఘరానా మహిళను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె స్వస్థలం కడప. బ్యూటీ పార్లర్లే టార్గెట్‌గా మహిళ దొంగతనాలు చేసేది. డైసీ బీఏ లిటరేచర్ చదివింది.. దొంగతనాలకు అలవాటు పడింది. ఆమె నుంచి రూ. 17 లక్షల విలువ చేసే 63 తులాల బంగారాన్ని మారేడుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నార్త్ జోన్ డీసీపీ సుమతి మాట్లాడుతూ.. ఆమె 2009 నుంచి నగరంలో దొంగతనాలు చేస్తోంది. మూడు నెలల్లోనే 17 దొంగతనాలు పాల్పడిందని తెలిపారు. ఆమె హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9, సైబారాబాద్‌లో 5, రాచకోండలో 3 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు డీసీపీ చెప్పారు. నగరంలో ఆమె దొంగలించిన సోత్తును మొత్తం రికవరీ చేశామన్నారు. అంతేకాక ఆ మహిళపై పీడీ యాక్ట్ పెడుతామని డీసీపీ సుమతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment