వివాహ వేడుకకు హాజరైన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. కళ్యాణ మంటపం దగ్గర నిల్చున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లాడు ఓ దుండగుడు. మహిళ వెనకే నిల్చున్న ఆ వ్యక్తి అదును చూసి మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లాడు. ప్రతిఘటించడానికి ప్రయత్నించిన మహిళను పక్కకు తోసి బయటకు పారిపోయాడు. ఈ అనూహ్య సంఘటనతో షాక్‌కు గురయిన మహిళ తేరుకుని దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఈ లోపే నిందుతుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెళ్లి వేడుకలో మహిళకు చేదు అనుభంం
Published Fri, Nov 16 2018 12:54 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
Advertisement