
చాలామంది కష్టపడి సంపాదించడం కంటే ఈజీగా డబ్బు సంపాదించే మార్గాల కోసం అన్వేషిస్తారు. ఈ క్రమంలో ఎలాంటి అక్రమార్గాల్లో పయనిస్తారో చెప్పలేం. సులభంగా మంచి మార్గంలో సంపాదించడం వేరు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం అంటే అతి కచ్చితంగా తప్పుడు మార్గేమే అవుతుంది. అచ్చం అలానే ఇక్కొడొక యువ ఇంజనీర్ సంపాదిస్తున్న జీతంతో సంతృప్తి చెందక చైన్ స్నాచింగ్‌ల వైపు ఆకర్షితుడయ్యాడు. అయితే ఇదేక్కడ జరిగింది ఏంటో చూద్దాం.
(చదవండి: వామ్మె! ఈ గుమ్మడి కాయ 17 మంది బరువుతో సమానం)
వివరాల్లోకెళ్లితే.....ముంబైలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు కొడుకు ఉమేశ్ పాటిల్‌గా కనీసం 20 చైన్ స్నాచింగ్‌లు తుషార్ ధిక్లే అనే భాగస్వామ్యంతో మొత్తం 36 గొలుసులు దొంగతనం చేశాడు. ఆ తర్వాత నుంచి పాటిల్ తానొక్కడే చైన్ స్నాచింగ్‌లు చేయడం మొదలు పెట్టాడు. ఈ తరుణంలో పాటిల్ ఒక రోజు ద్విచక్ర వాహనం పై నెమ్మదిగా వస్తూ బంగారు అభరణాలను ధరించిన ఒక మహిళ వద్ద యూటర్న్ తీసుకోవడం ఇద్దరూ పోలీసులు గమినించి అతన్ని వెంబడిస్తారు.
ఈ క్రమంలో పోలీసులు తమ ద్విచక్రవాహనాలతో అతని బైక్‌ని ఢీకొడతారు. దీంతో ముగ్గురు కింద పడిపోతారు. అయినప్పటికీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయడం మొదలుపెడతారు. ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ " పాటిల్ 2015లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఒక కాంట్రాక్టర్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు.పైగా తనకు వస్తున్న జీతంతో ఏ మాత్రం సంతృప్తి చెందక చైన్ స్నాచింగ్‌ల చేయడం మొదలు పెట్టాడు.
ఈ చైన్ స్నాచింగ్‌లతో సంపాదించిన డబ్బుతో రూ.48 లక్షలు విలువ చేసే ఫ్లాట్, ఒక కారు కొన్నాడు. అంతేకాదు అతని ఇంట్లో సోదా చేస్తే రూ.2.5 లక్షల నగదు, 27 బంగారు గొలుసులు లభించాయి. పాటిల్ మొత్త బ్యాంక్ బ్యాలెన్స్ విలువ రూ.20 లక్షలు." అని వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు పాటిల్‌తో పాటు అతని భాగస్వామి తుషార్ ధిక్లేను నగరానికి చెందిన నలుగురు నగల వ్యాపారులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
(చదవండి: చూడ్డానికి పిల్ల...కానీ చెరుకు గడలను ఎలా లాగించేస్తుందో!)
Comments
Please login to add a commentAdd a comment