
పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్
సాక్షి, హైదరాబాద్: నగరంలో తీవ్ర కలకలం రేపిన చైన్ స్నాచర్ల బైక్‌ను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఇరవై నాలుగు గంటల్లో 11 ప్రాంతాల్లో ఓ ముఠా చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన అలజడి సృష్టించిన విషయం తెలిసింది. దీనిపై గ్రూపులుగా విడిపోయి గాలింపు చేపట్టిన పోలీసులు పాతబస్తీలోని భవానీ నగర్ వద్దగల ముళ్లపొదల్లో బైన్‌ను గుర్తించారు. అయితే దొంగలు బైక్‌ను అక్కడ వదిలి వేరే ప్రాంతానికి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బైక్ నెంబర్ ఆధారంగా యజమానిని అదుపులోకి తీసుకుని విచారించగా.. రెండేళ్ల క్రితమే తాను ఆ బైక్‌ను అమ్మినట్లు తెలిపారు. దీంతో దోపిడిగా పాల్పడిన ముఠా హైదరాబాద్ వారే కావొచ్చనన్న కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవారియా గ్యాంగ్ పనిగా అనుమానించిన రాచకొండ పోలీసులు ఆకోణంలో విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment