భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మావూళ్లమ్మ గుడి సమీపంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బైకుపై వచ్చిన ముగ్గురు బీహారీ యువకులు ఓ మహిళలో బంగారపు తెంచుకుపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు ప్రతిఘటించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా నాటు తుపాకీ కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దొంగల్లో ఒకరిని స్థానికులు పట్టుకున్నారు. మిగతా ఇద్దరు పారిపోయారు.
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భీమవరంలో ఉంటున్న పది మంది బీహార్ యువకులను పోలీసుస్టేషన్ కు పిలిపించారు. పారిపోయిన ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పెరిగిన చైన్ స్నాచింగ్ ల వెనుక బీహారీ గ్యాంగుల హస్తం ముందని పోలీసులు అనుమానిస్తున్నారు.
భీమవరంలో తుపాకీ కాల్పుల కలకలం
Published Sun, Nov 16 2014 10:41 PM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM
Advertisement
Advertisement