
రాత్రి బైటకెళ్లిన భార్యాభర్తలకి చేదు అనుభవం
సుల్తాన్ బజార్: బంధువుల ఇంట్లో పూజకు వెళ్లి తిరిగొస్తున్న మహిళ పుస్తెలతాడును దుండగులు లాక్కెళ్లారు. సోమవారం సుల్తాన్ బజార్ పోలీసుల కథనం ప్రకారం... చిక్కడపల్లి జవహార్‌నగర్‌కు చెందిన మాధవి ఆమె భర్త రవికుమార్ ఆదివారం చంచల్‌గూడలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన పూజకు వెళ్లారు.
రాత్రి 11.45కి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా కుద్బిగూడలో ముఖాలకు మాస్క్‌లు ధరించి ఉన్న ఇద్దరు దుండగులు వారిని బైక్‌పై వెంబడించారు. అదను చూసుకొని మాధవి మెడలో ఉన్న 3 తులాల పుస్తెలతాడును తెంచుకొని వేగం గా పారిపోయారు. బాధితులు అదే రోజు రాత్రి సుల్తాన్ బజార్ ఠాణాకు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.