రాయదుర్గం రూరల్ : మండలంలోని 74-ఉడేగోళంలో చైన్‌స్నాచింగ్ జరిగింది. గ్రామానికి చెందిన టెంకాయల మల్లికార్జున భార్య గిరిజమ్మ మరికొందరు మహిళలు బుధవారం తెల్లవారుజామున వాకింగ్ కోసం బయలుదేరారని పోలీసులు తెలిపారు. కేటీఎస్ డిగ్రీ కళాశాల వరకూ వచ్చి ఇంటికి తిరుగు పయనమయ్యారు. అంతలోనే ఇద్దరు అపరిచిత్తులు బైక్‌పై వెనక నుంచి వచ్చి గిరిజమ్మ మెడలోని ఐదు తులాల బంగారు గొలుసును అపహరించుకుని క్షణాల్లో మాయమయ్యారు. గమనించిన తోటి మహిళలు గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకుండాపోయింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.