హైదారాబాద్ రాజేంధ్రనగర్ పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అశోక్ రబ్బర్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పారు .
ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్ని మాపక సిబ్బంది ప్రాథమిక అంచనాకు వచ్చారు. గోడౌన్ రెండు నెలలు కిందట మూత పడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వేసవి సమీపిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
రబ్బర్ గోడౌన్లో అగ్నిప్రమాదం
Published Sun, Jun 1 2014 10:10 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement