అగ్నిప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం | man burnt alive in fire accident in rajendra nagar | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం

Published Thu, Jan 2 2014 8:49 AM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

అగ్నిప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం - Sakshi

అగ్నిప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం

హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో జరిగిన అగ్ని ప్రమాదంలో  ఓ వ్యక్తి సజీవ దహనానికి గురయ్యాడు. రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలోని  ఓ చెత్త దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షాపులోని నుంచి మంటలు రావడానికి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పింది.

అనంతరం ఘటన స్థలంలో పూర్తిగా కాలిపోయిన  ఓ వ్యక్తి మృతదేహాన్నిపోలీసులు గుర్తించారు. షాపులో చలిమంట వేయడంతో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement