ఆలయ ప్రహరీ కూల్చివేత..ఆందోళన | Illegal structures Demolition in rajendra nagar | Sakshi
Sakshi News home page

ఆలయ ప్రహరీ కూల్చివేత..ఆందోళన

Published Sat, Jul 25 2015 9:14 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

ఆలయ ప్రహరీ కూల్చివేత..ఆందోళన - Sakshi

ఆలయ ప్రహరీ కూల్చివేత..ఆందోళన

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలోని మణికొండ ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ స్థలంలో ఉన్న శివాలయానికి ప్రహరీ, వాణిజ్య షట్టర్లను నిర్మిచారు. దీంతో రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ స్థలంలోని అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.  శనివారం ఉదయం తహశీల్దారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆలయ ప్రహరీ, వాణిజ్య షట్టర్లను కూల్చివేశారు.

కాగా, కూల్చివేతలను వ్యతిరేకిస్తూ అన్ని పార్టీల ఆధ్వర్యంలో స్థానికులు ధర్నాకు దిగారు. కూల్చివేసిన వాటిని తిరిగి రెవెన్యూ సిబ్బందే నిర్మింపజేయాలని, అప్పటి వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఆందోళన కారులను రాయదుర్గం పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement