సాక్షి, రంగారెడ్డి : రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక దుర్గానగర్ చౌరస్తాలో బుధవారం రాత్రి బైకుపై ఇద్దరు వ్యక్తులు అతివేగంగా ప్రయాణిస్తూ విద్యుత్తు స్తంభాని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఆరంఘర్ నుంచి చంద్రయాన్‌గుట్ట వైపు అతి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టారు. మృతులు మహ్మద్ సాజిత్ తన స్నేహితుడు కాజా మోయినుద్దీన్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణంగా బైక్ అతివేగమే అని పోలీసులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment