mylar daverpally police station
-
మెరుపు వేగంతో బైక్.. ఇద్దరు మృతి
సాక్షి, రంగారెడ్డి : రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక దుర్గానగర్ చౌరస్తాలో బుధవారం రాత్రి బైకుపై ఇద్దరు వ్యక్తులు అతివేగంగా ప్రయాణిస్తూ విద్యుత్తు స్తంభాని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఆరంఘర్ నుంచి చంద్రయాన్గుట్ట వైపు అతి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టారు. మృతులు మహ్మద్ సాజిత్ తన స్నేహితుడు కాజా మోయినుద్దీన్గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణంగా బైక్ అతివేగమే అని పోలీసులు నిర్ధారించారు. -
ప్రాణం తీసిన గుర్రపు స్వారీ సరదా
హైదరాబాద్: గుర్రపు స్వారీ సరదా పాత బస్తీలో ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. బైకుపై వెళుతున్న వారిపై గుర్రం దాడి చేయడంతో హమీద్ షా ఖాన్(42) అనే వ్యక్తి మృతి చెందాడు. ఖజామ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. బాధితుల కుటుంబ సభ్యులు మైలార్ దేవరపల్లి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో హార్స్ రైడర్ సొహైల్, గుర్రాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నడిరోడ్డుపై హార్స్ రైడింగ్ పోటీలు నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుల తరపువారు ఆరోపించారు. మరికొంత యువకులు కూడా హార్స్ రైడింగ్ పందాల్లో పాల్గొన్నారని తెలిపారు. పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని అన్నారు.