ప్రాణం తీసిన గుర్రపు స్వారీ సరదా
హైదరాబాద్: గుర్రపు స్వారీ సరదా పాత బస్తీలో ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. బైకుపై వెళుతున్న వారిపై గుర్రం దాడి చేయడంతో హమీద్ షా ఖాన్(42) అనే వ్యక్తి మృతి చెందాడు. ఖజామ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. బాధితుల కుటుంబ సభ్యులు మైలార్ దేవరపల్లి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో హార్స్ రైడర్ సొహైల్, గుర్రాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నడిరోడ్డుపై హార్స్ రైడింగ్ పోటీలు నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుల తరపువారు ఆరోపించారు. మరికొంత యువకులు కూడా హార్స్ రైడింగ్ పందాల్లో పాల్గొన్నారని తెలిపారు. పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని అన్నారు.