
సాక్షి, హైదరాబాద్ : జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పులగూడ గ్రామం దుర్గానగర్ కాలనీలోని ఓ ఇంట్లో ఆర్.మౌలీధర్ నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజులుగా అతడి చెల్లి శ్రావణి ఫోన్ చేస్తున్నా తీయకపోవడంతో ఆందోళన చెందిన ఆమె సమీప బంధువైన ఆర్.నరేందర్ప్రదీప్కు తెలిపింది.
దీంతో అతను ఆదివారం సాయంత్రం మౌలీధర్ నివాసానికి వచ్చి చూడగా మొహానికి ప్లాస్టిక్ కవర్‌ను గ్యాస్ పైప్‌తో కట్టుకుని పడిఉండటాన్ని కిటికీలోంచి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతడి పక్కనే సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి చెల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment