
హరినాథ్‌కు పెన్షన్ స్కీం పత్రం అందజేస్తున్న ప్రధాన మంత్రి మోదీ
సాక్షి, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన ఎర్ర హరినాథ్ మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అసంఘటిత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి శ్రమ్–యోగి మందాన్ పెన్షన్ స్కీమ్ పత్రాన్ని అందుకున్నారు. ఈ పథకాన్ని అహ్మదాబాద్‌లో ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరై ప్రధాన మంత్రి చేతులమీదుగా సంక్షేమ పథకానికి సంబంధించిన పత్రాన్ని స్వీకరించాలని రెండు రోజుల క్రితం పీఎం కార్యాలయం నుంచి హరినాథ్‌కు సమచారం అందింది. ఈ సందర్భంగా మంగళవారం హరినాథ్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా పెన్షన్ పత్రాన్ని అందుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని చెప్పారు. తాను ఎప్పుడూ మోదీని నేరుగా చూస్తానని అనుకోలేదన్నారు. సంఘ సేవకుడైన హరినాథ్ ఎంతోమంది కార్మికులకు పెన్షన్‌తో పాటు కార్మిక సభ్యత్వాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment