PMSYM For Unorganized Workers Monthly Pension Of Rs 3k, Check Here How To Register - Sakshi
Sakshi News home page

PMSYM: నెలకు రూ.3 వేల పెన్షన్‌, దరఖాస్తు చేసుకోవడం ఎలా? 

Published Fri, Feb 10 2023 12:20 PM | Last Updated on Fri, Feb 10 2023 1:59 PM

PMSYM for unorganized workers monthly pension of Rs 3k how to register - Sakshi

సాక్షి, ముంబై: దేశంలోని అసంఘటిత కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమ యోగి మన్‌ధన్ యోజన నెలవారీ పెన్షన్‌ అందించనుంది. వృద్ధాప్యంలో ఉన్న కార్మికులకు  ఈ పథకం కింద నెలకు రూ.3,000 పెన్షన్ ఈ పథకం అందిస్తుంది. ముఖ్యంగా రూ.15,000 లోపు నెలవారీ ఆదాయం ఉన్న టైలర్లు, చెప్పులు కుట్టేవాళ్లు, రిక్షా పుల్లర్లు , ఇంటి కార్మికులు వంటి అసంఘటిత రంగంలోని కార్మికులకు  60 ఏళ్ల దాకా ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. 

అర్హతలు 
♦ 
దరఖాస్తుదారుడి వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి
♦ తప్పనిసరిగా ఆధార్ కార్డ్ , బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి.
♦ అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారు EPFO, NPS, NSIC సబ్‌స్క్రైబర్లు ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు. 

 పీఎం శ్రమ యోగి మన్‌ధన్ యోజన 
వృద్ధాప్యంలో ఉన్న కార్మికులకు పెన్షన్ ప్రయోజనాలను అందించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి మంధన్ యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి కార్మికుడికి 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ వస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేసే వారు, నెలవారీ ఆదాయం రూ. 15,000 కంటే తక్కువ ఉన్నవారు ఈ పథకాని అర్హులు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి మీ వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంత పెట్టుబడి పెట్టాలి?
కార్మికుల సహకారం ఆధారంగా ఈ పెన్షన్ లభిస్తుంది. ఇందుకు కోసం  ప్రతి నెలా రూ.55 నుండి రూ. 200 వరకు డిపాజిట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో 50 శాతం లబ్ధిదారుడు, 50 శాతం ప్రభుత్వం జమ చేస్తుంది. ఒక వేళ పింఛనుదారుడు మరణిస్తే అతని భార్య లేదా భర్త పెన్షన్ మొత్తాన్ని పొందుతారు. ఈ సందర్భంలో ప్రతి పెన్షనర్ సంవత్సరానికి రూ.36,000 పెన్షన్ పొందుతారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రెండు రకాలుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మన్‌ధన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫాం నింపిన తరువాత రిజిస్టర్డ్‌మొబైల్‌కు  ఓటీపీ వస్తుంది. ఈ ఓటిపీని ఎంటర్‌ చేస్తే చాలు. ఇక ఆఫ్‌లైన్‌ ద్వారా  అయితే కామన్ సర్వీస్ సెంటర్‌లో వివరాలను అందించి దరఖాస్తు చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement