![సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41435255538_625x300.jpg.webp?itok=X2ZcoGZD)
సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
చిన్నచింతకుంట : వంట గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో ఓ మహిళకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. వివరాలోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం చిన్నచింతకుంట మండలంలోని అప్పంపల్లికి చెందిన కుర్వ ముత్యాలమ్మ ఇంట్లో గ్యాస్ సిలిండర్‌పై వంట చేస్తోంది. కొద్దిసేపటికి దాని పైపు ద్వారా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆమె వెంటనే బయటకు పరుగులుతీసింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు సైతం ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనలో ఇంటి పెంకపై కప్పు ధ్వంసమైంది.
అందులో ఉన్న *50 వేలు, రెండు క్వింటాళ్ల బియ్యం, ఆధార్, రేషన్ కార్డులు మంటల్లో కాలిపోయాయి. హుటాహుటిన ఆత్మకూర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు.అనంతరం సంఘటన స్థలాన్ని సర్పంచ్ నెల్లి శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ యతిరాజ, పోలీసులు పరిశీలించి *1.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు.