
సాక్షి, తిరుపతి: నగర శివారులోని కొర్లగుంటలో పాప్‌కార్న్ తయారీ బండిలో శనివారం పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో అయిదుగురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా పాప్ కార్న్ బండిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌కు గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.