
సాక్షి, హైదరాబాద్: అమలాపురం టీడీపీ ఎంపీ పి. రవీంద్రబాబు సోమవారం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావుతో పాటు వైఎస్ జగన్‌తో ఆయన భేటీ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై రవీంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. అమలాపురం ఎంపీ టిక్కెట్‌పై మరోసారి భరోసా ఇవ్వకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నట్టు సమాచారం. కాగా, అనకాపల్లి ఎంపీ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అవంతి శ్రీనివాసరావు ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. (వైఎస్సార్‌సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్)
Comments
Please login to add a commentAdd a comment