P Ravindra babu
-
వైఎస్సార్సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ
-
వైఎస్సార్సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని అమలాపురం ఎంపీ పి. రవీంద్రబాబు అన్నారు. పుట్టింటికి వచ్చినట్టుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావుతో కలిసి రవీంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. (వైఎస్ జగన్‌ను కలిసిన టీడీపీ ఎంపీ) ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారని, ఆయన వల్లే ప్రత్యేక హోదా రాలేదని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోవడం వల్లే చంద్రబాబు హడావుడిగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనికిరారని, ఆయన వల్ల రాష్ట్రం బాగుపడదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతిచోట అవినీతి పెరిగిపోయిందని, ఒకే సామాజిక వర్గానికి మేలు జరుగుతోందని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్ సీపీలో చేరినట్టు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే సత్తా వైఎస్ జగన్‌కు మాత్రమే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఏకమై వైఎస్సార్ సీపీని గెలిపించాలని రవీంద్రబాబు కోరారు. పేదరికం పోవాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు. కులాలవారీగా చంద్రబాబు దగ్గర ఆర్మీ ఉంటుందని, ఏ కులం వారితో ఆ కులం వారిని తిట్టిస్తారని చెప్పారు. అమలాపురం ఎంపీ పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసినట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను మీడియాకు చూపించారు. టీడీపీకి కూడా రాజీనామా చేసినట్టు తెలిపారు. (వైఎస్సార్సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్) -
వైఎస్ జగన్‌ను కలిసిన టీడీపీ ఎంపీ
సాక్షి, హైదరాబాద్: అమలాపురం టీడీపీ ఎంపీ పి. రవీంద్రబాబు సోమవారం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావుతో పాటు వైఎస్ జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై రవీంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. అమలాపురం ఎంపీ టిక్కెట్‌పై మరోసారి భరోసా ఇవ్వకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నట్టు సమాచారం. కాగా, అనకాపల్లి ఎంపీ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అవంతి శ్రీనివాసరావు ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. (వైఎస్సార్సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్) -
'రోహిత్‌ది ఆత్మహత్య కాదు హత్యే'
కాకినాడ : హెచ్‌సీయూలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు స్పందించారు. మంగళవారం కాకినాడలో రవీంద్రబాబు మాట్లాడుతూ... రోహిత్‌ది ఆత్మహత్య కాదు హత్యే అని ఆయన స్పష్టం చేశారు. రోహిత్ మృతిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోహిత్ మరణానికి కులం, రాజకీయ రంగు అంటించవద్దని రాజకీయపార్టీలు, విద్యార్థి సంఘాలకు రవీంద్రబాబు సూచించారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీపై కేసులు నమోదు చేస్తే... ఈ వివాదం పక్కదారి పడుతుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న భారత్‌లో దళితులు ఇంకా అణచివేతకు గురవుతున్నారనడానికి రోహిత్ ఆత్మహత్యే ఓ నిదర్శనమని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.