'రోహిత్ది ఆత్మహత్య కాదు హత్యే' | P Ravindra babu responds on rohit suicide in HCU | Sakshi
Sakshi News home page

'రోహిత్ది ఆత్మహత్య కాదు హత్యే'

Published Tue, Jan 19 2016 11:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

'రోహిత్ది ఆత్మహత్య కాదు హత్యే'

'రోహిత్ది ఆత్మహత్య కాదు హత్యే'

కాకినాడ : హెచ్సీయూలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు స్పందించారు. మంగళవారం కాకినాడలో రవీంద్రబాబు మాట్లాడుతూ... రోహిత్ది ఆత్మహత్య కాదు హత్యే అని ఆయన స్పష్టం చేశారు. రోహిత్ మృతిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోహిత్ మరణానికి కులం, రాజకీయ రంగు అంటించవద్దని రాజకీయపార్టీలు, విద్యార్థి సంఘాలకు రవీంద్రబాబు సూచించారు.

కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీపై కేసులు నమోదు చేస్తే... ఈ వివాదం పక్కదారి పడుతుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అభివృద్ధి  చెందుతున్న భారత్లో దళితులు ఇంకా అణచివేతకు గురవుతున్నారనడానికి రోహిత్ ఆత్మహత్యే ఓ నిదర్శనమని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement