HCU student
-
ఓఆర్ఆర్పై కారు బోల్తా : యువతి మృతి
-
రోహిత్ మరణంపై కేసీఆర్ స్పందించలేదు
హైదరాబాద్ : హెచ్‌సీయూ వీసీని సస్పెండ్ చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి... సస్పెండ్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... వీహెచ్ బుధవారం ట్యాంక్‌బండ్ వద్ద గంటపాటు మౌన దీక్ష చేపట్టారు. మౌన దీక్ష విరమించిన అనంతరం వీహెచ్ మాట్లాడుతూ.... రోహిత్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంపై వీహెచ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ బడుగుల వ్యతిరేకి అని ఈ సందర్భంగా అర్థమైందని అన్నారు. రోహిత్ మరణానికి ఏబీవీపీ, బీజేపీలే కారణమని వీహెచ్ ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు జోక్యం వల్లే హెచ్‌సీయూ విద్యార్థులు సస్పెండ్ అయ్యారని విమర్శించారు. రోహిత్ కులంపై చర్చ అనవసరం అని వీహెచ్ అభిప్రాయపడ్డారు. బీఫ్ తినడంపై రాజకీయాలు చేస్తున్నాయని ఎంఐఎం, బీజేపీలపై వీహెచ్ నిప్పులు చెరిగారు. -
'నా కుమారుడు ముమ్మాటికీ వడ్డెర కులస్తుడే'
విజయవాడ: తన కుమారుడు వేముల రోహిత్ మరణంపై అతడి తండ్రి మణికుమార్ నోరు విప్పారు. తన కుమారుడిది ఆత్మహత్యా కాదని, హత్య అని ఆరోపించారు. తన కొడుకు మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడు ముమ్మాటికీ వడ్డెర కులస్తుడేనని ఆయన స్పష్టం చేశారు. తాము ఎస్సీ కులానికి చెందినవారిమని తన భార్య ఎందుకు చెబుతుందో అర్థం కావడం లేదన్నారు. రోహిత్ మరణంపై రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యతో విడాకులు తీసుకున్నా ఆమెతో కలిసే ఉంటున్నట్టు వెల్లడించారు. ఇటీవలే తన చిన్న కుమారుడి నిశ్చితార్థం నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ చేస్తున్న రోహిత్ ఈ నెల 17న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలి
-
'పోరాటం కొనసాగిస్తాం'
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్‌సీయూ విద్యార్థుల జేఏసీ స్పష్టం చేసింది. ఏడుగురు విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారం రెండో రోజకు చేరుకుంది. వీసీ అప్పారావును సస్పెండ్ చేయాలని విద్యార్ధుల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చాలని విద్యార్థులు బుధవారం నిరవధిక దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. రోహిత్ ఘటనపై పోరును ఉధృతం చేసేందుకు విద్యార్థులు జేఏసీగా ఏర్పడిన సంగతి తెలిసిందే. -
ఆ ఇద్దరు మంత్రులను మోదీ బర్తరఫ్ చేయాలి
-
'ఆ ఇద్దరు మంత్రులను మోదీ బర్తరఫ్ చేయాలి'
హైదరాబాద్ : కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ ఒత్తిళ్ల వల్లే... హెచ్‌సీయూ నుంచి విద్యార్థులను సస్పెండ్ చేశారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఆ ఇద్దరు మంత్రులను ప్రధాని మోదీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో బుధవారం హెచ్‌సీయూకి సీతారాం ఏచూరి విచ్చేశారు. స్థానిక విద్యార్థులతో మాట్లాడిన అనంతరం సీతారాం ఏచూరి విలేకర్లతో మాట్లాడుతూ... హెచ్‌సీయూ వీసీని తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. అసలు వీసీ నియామకమే రాజకీయంగా జరిగిందని విమర్శించారు. విద్యార్థుల మధ్య గొడవ సమసిపోయాక సదరు విద్యార్థులను సస్పెన్షన్ ఎలా చేశారని ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ కుట్రపూరితంగా జరిగాయని అన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. -
'రోహిత్ కుటుంబానికి రూ. 5 కోట్లు చెల్లించాలి'
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ కుటుంబానికి రూ. 5 కోట్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్‌లో విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ... హెచ్ సీ యూ వీసీ పి. అప్పారావును వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే రోహిత్ మరణానికి కారణమైన కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో జరగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. రోహిత్ కులంపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ ఆరోపించింది. ఈ సందర్భంగా రోహిత్‌కు గతంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాన్ని విద్యార్థి జేఏసీ మీడియాకు విడుదల చేసింది. రోహిత్‌కు వ్యతిరేకంగా బీజేపీ, ఏబీవీపీ దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించింది. రోహిత్ అంత్యక్రియలను హడావిడిగా జరపడం వెనుక కుట్ర దాగి ఉందని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ అనుమానం వ్యక్తం చేసింది. -
నివేదిక వచ్చిన తర్వాతే స్పందిస్తా: స్మృతీ
న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంశం రాష్ట్రానికి చెందిన వ్యవహారమని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్యపై మంగళవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. విద్యార్థి ఆత్మహత్యపై ద్విసభ్య కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే తాను ఈ అంశంపై స్పందిస్తానని చెప్పారు. అప్పటి వరకు తాను ఈ అంశంపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని స్మృతీ ఇరానీ తెలిపారు. -
'రోహిత్‌ది ఆత్మహత్య కాదు హత్యే'
కాకినాడ : హెచ్‌సీయూలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు స్పందించారు. మంగళవారం కాకినాడలో రవీంద్రబాబు మాట్లాడుతూ... రోహిత్‌ది ఆత్మహత్య కాదు హత్యే అని ఆయన స్పష్టం చేశారు. రోహిత్ మృతిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోహిత్ మరణానికి కులం, రాజకీయ రంగు అంటించవద్దని రాజకీయపార్టీలు, విద్యార్థి సంఘాలకు రవీంద్రబాబు సూచించారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీపై కేసులు నమోదు చేస్తే... ఈ వివాదం పక్కదారి పడుతుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న భారత్‌లో దళితులు ఇంకా అణచివేతకు గురవుతున్నారనడానికి రోహిత్ ఆత్మహత్యే ఓ నిదర్శనమని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
మరణంలోనే నాకు ఆనందముంది
రోహిత్ రాసిన సూసైడ్ నోట్ సారాంశం... ‘మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను మీ మధ్యన ఉండను. ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను. మీలో కొందరు నన్ను ప్రేమించారు. కంటికి రెప్పలా చూసుకున్నారు...ఆదరించారు. కానీ నాకు అనేక సమస్యలున్నాయి. అవే నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించాయి. బతికుండటం కంటే మరణంలోనే నాకు ఆనందముంది. నా దేహానికి, ఆత్మకు దూరం పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. కార్ల్ సాగన్ మాదిరిగా గొప్ప సైన్స్ రచయిత కావాలనుకున్నా. చివరకిలా ఆత్మహత్య లేఖ రాయాల్సి వచ్చింది. ఇలాంటి లేఖ రాయడం నాకిదే తొలిసారి. బహుశా నా చర్య తప్పే కావచ్చు. ఈ ప్రపంచాన్ని మొదటినుంచీ తప్పుగానే అర్థం చేసుకుంటూ వస్తున్నానేమో! ప్రస్తుతం నాలో బాధా లేదు, ప్రేమా లేదు. పూర్తి శూన్యంగా ఉన్నాను. ఇది చాలా దారుణమైన స్థితి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నా చిన్ననాటి నుంచి ఒంటరితనం నుంచి నేనెప్పటికీ దూరం కాలేకపోయాను. నేను సైన్స్‌ను, ప్రకృతిని, నా చుట్టూ ఉన్న మనుషులను ప్రేమించాను. కానీ ప్రజలు ప్రకృతికి దూరమవుతున్నారు. నా మృతికి ఎవరి మాటలూ చర్యలూ కారణం కాదు. మనిషిని కులంతోనే అంచనా వేస్తున్నారు తప్ప తనకు మనసుంటుందని గుర్తించడంలేదు. మనిషిని ఒక ఓటుగా, అంకెగా, వస్తువుగానే చూస్తున్నారు. గాయపడకుండా ప్రేమించడం అసాధ్యంగా మారింది. మరణించాక నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను. ఆత్మలపై, పునర్జన్మలపై నాకైతే నమ్మకంలేదు. మరణానంతరం నేను చుక్కలదాకా పయనిస్తానని, ఇతర ప్రపంచాల గురించి తెలుసుకుంటానని నా నమ్మకం. నాకు ఏడు నెలల ఫెలోషిప్ రూ.1.75 లక్షలు రావాల్సి ఉంది. అందులో రూ.40 వేలు రామ్‌జీకి చెల్లించండి. మిగతాది నా కుటుంబానికి అందజేయండి. నా అంత్యక్రియలు ప్రశాంతంగా, సాఫీగా జరిగిపోనీండి. నా కోసం ఎవరూ ఏడవొద్దు. నన్నెంతగానో ప్రేమించిన ఏఎస్ఏ సంఘం సభ్యులు వారిని బాధపెడుతున్నందుకు నన్ను క్షమించాలి. తన గదిని ఉపయోగించుకున్నందుకు ఉమ అన్న క్షమించాలి’. -
హెచ్‌సీయూ విద్యార్థినికి ‘రైటర్స్’ అవార్డు
హైదరాబాద్: జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ రైటర్స్ అవార్డుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన పరిశోధక విద్యార్థిని వరం శ్రీదేవి ఎంపికయ్యారు. ఈ పరిశోధక అవార్డుకు ఎంపికైన మొదటి భారతీయ పరిశోధక విద్యార్థిని శ్రీదేవి కావడం విశేషం. యూ.కే.కు చెందిన జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ ఫౌండేషన్ ఏటా ఈ అవార్డును ప్రకటిస్తుంది. హెచ్‌సీయూలోని స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్ కోటేశ్వరరావు వి.రాజులపాటి పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేసిన శ్రీదేవి ’స్ట్రైన్ రేట్ సెన్సిటివిటీ అంశంపై పంపించిన పరిశోధన పత్రం ‘’ఫిలాసాఫికల్ మేగజైన్ లెటర్స్’ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైంది. 2012లో ఐఐటీ మద్రాస్‌లో జరిగిన సదస్సులో సమర్పించిన పరిశోధక పత్రానికి బెస్ట్ పేపర్ అవార్డును సైతం ఆమె అందుకున్నారు.