ఆత్మహత్య చేసుకున్న రోహిత్కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్సీయూ విద్యార్థుల జేఏసీ స్పష్టం చేసింది.
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న రోహిత్కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్సీయూ విద్యార్థుల జేఏసీ స్పష్టం చేసింది. ఏడుగురు విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారం రెండో రోజకు చేరుకుంది. వీసీ అప్పారావును సస్పెండ్ చేయాలని విద్యార్ధుల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చాలని విద్యార్థులు బుధవారం నిరవధిక దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. రోహిత్ ఘటనపై పోరును ఉధృతం చేసేందుకు విద్యార్థులు జేఏసీగా ఏర్పడిన సంగతి తెలిసిందే.