చింతా అనురాధపై దుష్ప్రచారం.. | YSRCP Mp condidate chinta anuradha Yellow Media Rumors | Sakshi
Sakshi News home page

పోటీ నుంచి తప్పుకోలేదు: చింతా అనురాధ

Published Mon, Apr 8 2019 3:45 PM | Last Updated on Mon, Apr 8 2019 7:09 PM

YSRCP Mp condidate chinta anuradha Yellow Media Rumors - Sakshi

సాక్షి, అమలాపురం : తనపై ఎల్లోమీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను అమలాపురం పార్లమెంటు వైఎస్సార్ సీపీ అభ్యర్థి చింతా అనురాధ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల పోటీ నుంచి చింతా అనురాధ తప్పుకున్నట్లు ఎల్లో మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనపై చింతా అనురాధ మాట్లాడుతూ తాను పోటీ నుంచి తప్పుకోలేదని, ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే ఎల్లో మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మహిళలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం ఇచ్చారని, దీన్ని కూడా ఎల్లో మీడియా సహించలేకపోతోందని ఆమె నిప్పులు చెరిగారు. తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నామని, దుష్ర్పచారాలను తాము పట్టించుకోమని చింతా అనురాధ తెలిపారు. 

ఎంపీ రవీంద్రబాబు మాట్లాడుతూ.. చింతా అనురాధ ఎన్నికల్లో గెలవబోతున్నారని టీడీపీ ఇలాంటి కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. టీడీపీ, ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు చేసినా అనురాధ గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement