Chinta Anuradha
-
చంద్రబాబు నిర్లక్ష్యంతోనే కోటిపల్లి రైల్వే లైన్ ఆలస్యం
అల్లవరం: రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కోటిపల్లి –నరసాపురం రైల్వే లైన్ నిర్మాణంపై నిర్లక్ష్యం వహించారని, లోక్‌సభలో టీడీపీ ఎంపీలు కోటిపల్లి రైల్వే లైన్ ఆవశ్యకతను వివరించి నిధులు తేవడంలో విఫలమయ్యారని అమలాపురం ఎంపీ చింతా అనురాధ తెలిపారు. అల్లవరం మండలం మొగళ్ళమూరులోని ఆమె నివాసంలో కోటిపల్లి రైల్వేలైన్ పురోగతిపై గురువారం ఎంపీ అనురాధ మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రూ.1,409 కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు. కోటిపల్లి–శానపల్లిలంక, బోడసకుర్రు– పాశర్లపూడి, చించినాడ–నరసాపురం నదులపై రైల్వే లైన్ వంతెనలు పిల్లర్లు నిర్మాణంలో చివరి దశలో ఉన్నాయన్నారు. నదులపై నిర్మాణంలో ఉన్న వంతెనలకు గడ్డర్ల ఏర్పాటుకు రైల్వే శాఖ టెండర్లు ప్రక్రియను పూర్తి చేసిందని, త్వరలో పనులు ప్రారంభించనున్నారని తెలిపారు. అమలాపురం నుంచి చించినాడ వరకు రైల్వే లైన్ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే రూ.50 కోట్లు విడుదల చేశారని ఎంపీ అన్నారు. రాష్ట్ర వాటాగా ఒక రూపాయి కుడా ఎందుకు విడుదల చేయలేకపోయారో చంద్రబాబు, ఆయన ఎంపీలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేసిన రూ.50 కోట్ల నిధులతో భూసేకరణ వేగవంతమైందని తెలిపారు. రైల్వే లైన్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని, కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించడంలో కీలక భూమిక పోషిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తాను ఎంపీగా పార్లమెంట్లో కోటిపల్లి–నరసాపురం రైల్వేలైన్ ప్రాముఖ్యతను వివరిస్తూ అధిక నిధులు కేటాయింపులు చేయించానన్నారు. తాను ఎంపీగా మొత్తంగా రూ.1,409 కోట్లు రైల్వే లైన్ నిర్మాణం కోసం నిధుల కేటాయింపులు జరిగాయన్నారు. కేంద్ర బడ్జెట్లో కోటిపల్లి–నరసాపురం రైల్వే ప్రాజెక్టుకు రూ.300 కోట్లు, కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైల్వే ట్రాక్ మరమ్మతులకు రూ.10 కోట్లు, భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.50 కోట్లు విడుదల చేస్తే కోటిపల్లి రైల్వే లైన్‌పై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికై నా నిజాలు తెలుసుకొని, కోటిపల్లి రైల్వే లైన్‌పై చంద్రబాబు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మే 13 న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణా స్వీకారం చేస్తారని, సీఎం జగన్ నేతృత్వంలోనే కోటిపల్లి–నరసాపురం రైలు పట్టాలు ఎక్కుతుందని, కోనసీమ జిల్లా ప్రజల చిరకాల కోరిక తీరుతుందని ఎంపీ అనురాధ అన్నారు. -
దిశ బిల్లుకు చట్టరూపం కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాల కేసుల్లో సత్వర న్యాయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2019లో తీర్మానం చేసిన దిశ బిల్లుకు చట్టరూపం కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ కేంద్ర ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం, కఠినశిక్షల నిమిత్తం ప్రత్యేక కోర్టుల ఏర్పాటును బిల్లులో పొందుపరిచారని తెలిపారు. సమర్థమైన న్యాయబట్వాడా వ్యవస్థ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వానికి సహకరించాలని, ఈ మేరకు దిశ బిల్లుకు చట్టరూపం కల్పించాలని కోరారు. బిల్లు హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో పెరుగుతున్న పత్తి ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌లో 2020–21తో పోలిస్తే 2022–23లో పత్తి ఉత్పత్తి పెరిగిందని కేంద్ర జౌళిశాఖ సహాయమంత్రి దర్శన జర్దోష్ తెలిపారు. 2020–21లో 16 లక్షల బేళ్లు, 2021–22లో 17.08 లక్షల బేళ్లు, 2022–23లో (తాత్కాలికంగా) 17.85 లక్షల బేళ్లు ఉత్పత్తి అయినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నకు సమాధానమిచ్చారు. వివిధ స్థాయిల్లో 31 రైల్వే ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లో 31 రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇవి రూ.70,594 కోట్ల విలువైన 16 కొత్త లైన్లు, 15 డబ్లింగ్ పనులకు సంబంధించిన ప్రాజెక్టులని వైఎస్సార్సీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. ‘గిరిజన’ బిల్లుకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు లోక్‌సభలో గిరిజనులకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన సవరణ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి చెప్పారు. ఈ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. -
శ్రీశైలం, సాగర్లకు ‘డ్రిప్’ అమలు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: డ్యామ్‌ల భద్రత, కార్యాచరణ, పనితీరును మెరుగుపరచటానికి ఉన్న కేంద్ర పథకం డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (డ్రిప్) కింద శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు సత్వరం మరమ్మతులు చేపట్టాలని, ప్రాజెక్టుల అభివృద్ధి పనులను మెరుగుపరచాలని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కృష్ణాబోర్డు పరిధిలోని ఈ డ్యామ్‌ల భద్రత, నిర్వహణ సక్రమంగా చేయాలని, ఇందుకోసం జలశక్తి శాఖ ప్రత్యేక నిర్వహణ బృందాన్ని నియమించాలన్నారు. ప్రస్తుతం శ్రీశైలం ఆనకట్ట వైండింగ్ పూల్ ప్రమాదస్థితిలో ఉందని తెలిపారు. 2020లో నీటి ఉధృతికి నాగార్జునసాగర్ కుడికాల్వ గేటు విరిగిపోవడంతో చాలా నీరు వృథాగా పోయిందని చెప్పారు. వీటి అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలి: ఎంపీ సత్యనారాయణ విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇటీవలే ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించిందని గుర్తుచేశారు. ఒడిశాలోని ఓఎండీసీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ భారీ పెట్టుబడులు పెట్టిందని, కానీ నేటివరకు ముడిసరుకు ప్లాంటుకు చేరలేదని చెప్పారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు అనుమతులు ఇవ్వడం లేదని, ఇది శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్లాంటుకు ఇనుప ఖనిజం గనులను కేటాయించి, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. నిర్వహణకు అవసరమైన విడిభాగాలు, బ్యాటరీలు అందుబాటులో లేవని తెలిపారు. వీటిని సమకూర్చాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలి: ఎంపీ చింతా అనూరాధ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ చింతా అనూరాధ కేంద్రాన్ని కోరారు. ఏడేళ్లుగా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడం లేదన్నారు. రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. వరద నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయండి: నందిగం సురేశ్ ఇటీవలి అకాల వర్షాలకు రాయలసీమ జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, పంటలు భారీగా దెబ్బతిని ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్ చెప్పారు. వారిని వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుందన్నారు. దీనికి సంబంధించి కేంద్రం అందించాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని కోరారు. కులగణన చేపట్టాలి: ఎంపీ తలారి రంగయ్య దేశ సంపద అన్ని వర్గాలకు సమానంగా వికేంద్రీకరణ జరగాలంటే తక్షణమే కులగణన చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య కేంద్రాన్ని కోరారు. దేశంలో 75 శాతం సంపద 10 శాతం జనాభా చేతిలో ఉందని చెప్పారు. ఈ అసమానతలు పోవాలంటే తక్షణమే కులగణన చేపట్టాలని కోరారు. -
ఆ వ్యాఖ్యలు హర్ష కుమార్‌కే వర్తిస్తాయి
అమలాపురం టౌన్: దళిత సమస్యలు ఎప్పుడు ఉత్పన్నమైనా మాజీ ఎంపీ హర్షకుమార్ తన స్వలాభానికే ఉపయోగించుకుంటున్నారని అమలాపురం ఎంపీ చింతా అనురాధ పేర్కొన్నారు. దళితులు అధికంగా ఉన్న అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆయన దళితులకు ఏం చేశారో ప్రజలకు తెలుసని ఆమె విమర్శించారు. అమలాపురంలో అనురాధ శుక్రవారం సాయంత్రం ‘సాక్షి’తో మాట్లాడారు. సీతానగరం పోలీసు స్టేషన్లో జరిగిన సంఘటన అత్యంత విచారకరమని, తమ ప్రభుత్వం తొలి నుంచీ ఖండిస్తూనే ఉందని గుర్తు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, డీజీపీ సవాంగ్‌లు స్పందించి బాధ్యులపై తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఈ విషయంలో హర్షకుమార్ వాడిన పదజాలం, ప్రదర్శించిన ఆవేశం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అని ఆమె ప్రశ్నించారు.(‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’) దళితుల మీద ఆయన చేసిన విమర్శలు, వ్యాఖ్యలు ఓ దళితుడిగా ఆయనకూ వర్తిస్తాయని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో దళితుల గురించి ఆయన చెప్పిన మాటలు ఎంత సత్య దూరమో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిసారీ మీరు అనుసరిస్తున్న తీరును...మీ చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జరిగిన ఘటనను వైఎస్సార్ సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముక్త కంఠంతో ఖండించారని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నదే దళితుల కోరికన్నారు. చదువుకున్న వాళ్లం.. ప్రజాప్రతినిధులం.. మన పదజాలం, ప్రవర్తన ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని హర్షకుమార్ విజ్ఞతకే... ఆయన మనః సాక్షికే వదిలేస్తున్నానని ఎంపీ అనురాధ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన నిరాధార వ్యాఖ్యలను హర్షకుమార్ వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
అర్హులకు ఏదీ దక్కనివ్వలేదు..!
సాక్షి, తూర్పుగోదావరి: కుల, మత, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ హామీ ఇచ్చారు. జిల్లాలోని మండపేటలో ఆదివారం జరిగిన గ్రామ వలంటీర్ల సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జన్మభూమి కమిటీలు చాలా అరాచకాలు చేశాయని విమర్శించారు. అర్హులైన లబ్ధిదారులకు ఫించను, ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు అందకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ సదస్సులో మంత్రి వెంట ఎంపీ చింత అనురాధ ఉన్నారు. -
కోకోనట్ బోర్డు సభ్యురాలిగా వైఎస్సార్సీపీ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : కోకోనట్ బోర్డు సభ్యురాలిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చింతా అనురాధ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం అధికారంగా ప్రకటించింది. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కోకోనట్ బోర్డును పనిచేస్తుంది. దేశంలో కొబ్బరి ఉత్పత్తుల అభివృద్దికి, కొబ్బరి సాగు విస్తర్ణం పెంచడానికి ఈ బోర్డు కృషి చేస్తుంది. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన అనురాధ అమలాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. -
చింతా అనూరాధ నివాసంలో విషాదం
సాక్షి, అమలాపురం : తూర్పు గోదావరి జిల్లా అమలాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి చింతా అనురాధకు మాతృ వియోగం కలిగింది. అనురాధ తల్లి విజయభారతి (64) ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. అనారోగ్యం కారణంగా అమలాపురం శ్రీనిధి హాస్పటల్లో చికిత్స పొందుతూ విజయభారతి మృతి చెందారు. దీంతో చింతా అనురాధకు వైఎస్సార్ సీపీ నేతలు పలువురు సంతాపం తెలిపారు. దీంతో చింతా అనురాధకు వైఎస్సార్ సీపీ నేతలు పలువురు సంతాపం తెలిపారు. -
ఎంపీ అభ్యర్థి అనురాధపై దుష్ప్రచారం
సాక్షి, అమలాపురం టౌన్: అమలాపురం ఎంపీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చింతా అనురాధ ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రత్యర్థుల కంటే ప్రచారంలో దూసుకు పోతుంటే.. ఆమె కార్యాలయాలకు తాళాలు వేశారని...చేతులెత్తేశారని సాగుతోన్న అసత్య ప్రచారాన్ని పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పెయిడ్ ప్రసారాలు, యాడ్ల కోసం పాకులాడే రెండు టీవీ ఛానళ్లల్లో వచ్చిన తప్పుడు ప్రసారాలను ఆ పార్టీ కార్యకర్తలు తిప్పుకొడుతున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ ఆర్ఓ, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనురాధ బంధువు, న్యాయవాది తాళ్ల సాంబమూర్తి, పార్టీ నాయకులు జిన్నూరి బాబి, పీకే రావు తదితరులు ఆయన ఫిర్యాదు అందజేశారు. అభ్యర్థి గెలుపును దెబ్బ తీసేందుకు ఫేక్ న్యూస్ ప్రసారం చేసిన 99 టీవీపైనా... ఆ టీవీ విలేకరిపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై విచారణ చేయిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రసారం చేసిన 99 టీవీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అది ఫేక్ న్యూసే : అనురాధ తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను లోక్‌సభ అభ్యర్థి అనురాధ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రసారం ఫేక్‌న్యూస్‌గా కొట్టిపారేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దళిత మహిళ తనపై నమ్మకం ఉంచి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. ఆయన నమ్మకానికి అనుగుణంగానే రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేసుకుంటున్నట్టు చెప్పారు. తప్పుడు ప్రచారం, ఫేక్‌న్యూస్ వల్ల మొత్తం నియోజకవర్గంలోని ప్రజల దృష్టి అంతా తనపై పడిందని, ఇప్పుడు అందరూ వాస్తవాలు తెలుసుకోవడంతో తనకు మంచే జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. -
చింతా అనురాధపై దుష్ప్రచారం..
సాక్షి, అమలాపురం : తనపై ఎల్లోమీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను అమలాపురం పార్లమెంటు వైఎస్సార్ సీపీ అభ్యర్థి చింతా అనురాధ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల పోటీ నుంచి చింతా అనురాధ తప్పుకున్నట్లు ఎల్లో మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై చింతా అనురాధ మాట్లాడుతూ తాను పోటీ నుంచి తప్పుకోలేదని, ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే ఎల్లో మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మహిళలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం ఇచ్చారని, దీన్ని కూడా ఎల్లో మీడియా సహించలేకపోతోందని ఆమె నిప్పులు చెరిగారు. తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నామని, దుష్ర్పచారాలను తాము పట్టించుకోమని చింతా అనురాధ తెలిపారు. ఎంపీ రవీంద్రబాబు మాట్లాడుతూ.. చింతా అనురాధ ఎన్నికల్లో గెలవబోతున్నారని టీడీపీ ఇలాంటి కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. టీడీపీ, ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు చేసినా అనురాధ గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు.