
సాక్షి, తూర్పుగోదావరి: కుల, మత, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ హామీ ఇచ్చారు. జిల్లాలోని మండపేటలో ఆదివారం జరిగిన గ్రామ వలంటీర్ల సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జన్మభూమి కమిటీలు చాలా అరాచకాలు చేశాయని విమర్శించారు. అర్హులైన లబ్ధిదారులకు ఫించను, ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు అందకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ సదస్సులో మంత్రి వెంట ఎంపీ చింత అనురాధ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment