![Nurse Commits Suicide Over Boyfriend Cheated Her In Amalapuram - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/24/13.jpg.webp?itok=bQjfm4aw)
సాక్షి. అమలాపురం : ప్రియుడు మోసం చేశాడనే మనస్తాపంతో అల్లవరం మండలం డి.రావులపాలెం శివారుసావరం పేటకు చెందిన కందికట్ల శాంతికుమారి(32) అనేనర్సు ఆత్మహత్యకు పాల్పడింది. తాలూకా పోలీసు స్టేషన్ ఏఎస్సై విప్పర్తి సత్యనారాయణ కథనం ప్రకారం.. శాంతికుమారి అమలాపురం కిమ్స్ ఆసుత్రిలో పదేళ్లుగా నర్సుగా పనిచేసింది. ఐదేళ్ల పాటు దుబాయ్‌లో ఉద్యోగం కూడా చేసింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 11 నెలల క్రితం మళ్లీ కిమ్స్ ఆసుపత్రిలో నర్సుగా చేరింది. నెల రోజుల నుంచి అమలాపురం రూరల్ మండలం కామనగరువు శివారు అబ్బిరెడ్డివారి కాలనీలో ఓ గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది. ఈమె కొన్నేళ్లుగా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన జంగా శ్రీనుతో సహజీవనం సాగిస్తోంది. చదవండి: టెన్త్ అబ్బాయి.. డిగ్రీ అమ్మాయి
ఈనెల 21న పెద్ద మనుషుల సమక్షంలో వీరి పెళ్లి విషయమై చర్చలు జరిగాయి. ఆ సమయంలో శ్రీను ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, తనకు ఇది వరకే పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పడంతో మనస్తాపం చెందిన శాంతికుమారి మంగళవారం తన ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తెకు ఫోన్ చేసినా స్పందిచకపోవడంతో తండ్రి నాగరాజు ఇంటికి వచ్చి చూస్తే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపింంది. తండ్రి నాగరాజు ఫిర్యాదుతో రూరల్లౖ సీఐ జి.సురేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment