ప్రతీకాత్మక చిత్రం
అమలాపురం రూరల్: కోనసీమ జిల్లా అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలల్లో వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న డెంటల్, నర్సింగ్ కాలేజీల్లో చదువుతోన్న విద్యార్థినులు బుధవారం వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కళాశాలల్లో గ్రాండ్ 9 అనే అవుట్ సోర్స్ ఏజెన్సీ ఇక్కడ మెస్ నిర్వహిస్తోంది. బుధవారం మధ్యాహ్నం విద్యార్థులు మెస్‌లో భోజనం చేశాక అస్వస్థతకు గురయ్యారు.
30 మంది బుధవారం రాత్రి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోలుకున్న కొందరిని నుంచి డిశ్చార్జి చేయడంతో తిరిగి హాస్టల్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం 15 మంది చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఆర్డీవో విచారణ చేపట్టారు. కలుషిత ఆహారం వల్లే అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. విద్యార్థులందరూ కోలుకుంటున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ సుబ్బారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment