![Dalit communities Candles Rally At Tallarevu Konaseema incident - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/25/rally.jpg.webp?itok=f_BXfIF0)
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
తాళ్లరేవు: కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ వెంకటసతీష్‌కుమార్ ఇళ్లకు నిప్పుపెట్టడాన్ని నిరసిస్తూ తాళ్లరేవులో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి దళిత, ప్రజాసంఘాల నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
దళిత నాయకులు కాశి లక్ష్మణస్వామి, జక్కల ప్రసాద్, రెడ్డి బాబు మాట్లాడుతూ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను కొనసాగించాలని కోరారు. అరాచక శక్తులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశ్వజన కళామండలి జిల్లా అధ్యక్షుడు వడ్డి ఏడుకొండలు, ప్రజాసంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, కె.ఈశ్వరీబాయి పాల్గొన్నారు.
మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి అమానుషం
అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ వెంకటసతీష్‌కుమార్ ఇళ్లపై దాడిచేసి తగులబెట్టడం అమానుషమని తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత పేర్కొన్నారు. శాంతియుత మార్గంలో నిరసన తెలియజేయాలి తప్ప ఇటువంటి ఘటనలకు పాల్పడడం దురదృష్టకరమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment