Dalit communities protest
-
లోకేష్ వ్యాఖ్యలను ఖండించి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన దళితులు
-
తాళ్లరేవులో కొవ్వొత్తుల ర్యాలీ
తాళ్లరేవు: కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ వెంకటసతీష్‌కుమార్ ఇళ్లకు నిప్పుపెట్టడాన్ని నిరసిస్తూ తాళ్లరేవులో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి దళిత, ప్రజాసంఘాల నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దళిత నాయకులు కాశి లక్ష్మణస్వామి, జక్కల ప్రసాద్, రెడ్డి బాబు మాట్లాడుతూ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను కొనసాగించాలని కోరారు. అరాచక శక్తులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశ్వజన కళామండలి జిల్లా అధ్యక్షుడు వడ్డి ఏడుకొండలు, ప్రజాసంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, కె.ఈశ్వరీబాయి పాల్గొన్నారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి అమానుషం అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ వెంకటసతీష్‌కుమార్ ఇళ్లపై దాడిచేసి తగులబెట్టడం అమానుషమని తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత పేర్కొన్నారు. శాంతియుత మార్గంలో నిరసన తెలియజేయాలి తప్ప ఇటువంటి ఘటనలకు పాల్పడడం దురదృష్టకరమని చెప్పారు. -
పవన్ బహుజనుల పక్షమో, ప్యాకేజీ పక్షమో తేల్చుకోవాలి
తాడికొండ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహుజనుల పక్షమో.. ప్యాకేజీ పక్షమో తేల్చుకోవాలని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 50వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గురునాథం మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్‌గా మారి.. అమరావతి జేఏసీ కోసం జోలె పడతామనడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న బహుజన పరిరక్షణ సమితి దీక్షలకు మద్దతు ఇవ్వకుండా తప్పుడు ప్రచారం చేస్తే జనసేన అధినేత పవన్‌కల్యాణ్, వామపక్షాల నేతలు, చంద్రబాబు ఇళ్లను ముట్టడించడం ఖాయమన్నారు. దీక్షలకు ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన దళిత సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ దిష్టిబొమ్మకు జోలెకట్టి అందులో పావలా నాణేలు వేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు, నవ్యాంధ్ర ఎమ్మారీ్పఎస్ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, పీవీ రావు మాల మహానాడు అధ్యక్షుడు నత్తా యోనరాజు, దళిత వర్గాల సమాఖ్య అధ్యక్షుడు చెట్టే రాజు, దళిత సంఘాల నాయకులు మేదర సురేష్, బొండపల్లి గిరిజ, బండి పుణ్యశీల, కాలే పుల్లారావు, బూదాల శ్రీనివాస్, మధిర ప్రభాకర్ పాల్గొన్నారు. -
3 రాజధానులకు అమరావతిలో అనూహ్య మద్దతు
తాడికొండ: అమరావతిలో వికేంద్రీకరణకు అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ దళిత సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్ వద్ద మూడు రోజుల నుంచి రాజధాని గ్రామాల రైతులు వికేంద్రీకరణకు అనుకూలంగా రిలే దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షల్లో వందలాది మంది మహిళలు పాల్గొంటున్నారు. దళిత బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్నాయి. రాజధానిలోని అన్ని గ్రామాల నుంచి తాళ్లాయపాలెం రిలే దీక్షా శిబిరానికి దళిత మహిళలు, యువకులు తరలివస్తున్నారు. అమరావతి పేరుతో తమకు జరిగిన అన్యాయం, తమను మోసం చేసి భూములు లాక్కున్న టీడీపీ నేతలు, ప్రైవేటు వ్యక్తుల గురించి వారు చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది. మూడు రాజధానులతో రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని, అమరావతితోపాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని మహిళలు కోరుతున్నారు. మాలమహానాడు, ఎంఆర్పీఎస్, పలు ప్రజా సంఘాల నాయకులు ఈ దీక్షలకు మద్దతు తెలుపుతున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా రాజధానిలో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, అన్ని వర్గాల మద్దతు కూడగడతామని వారు చెబుతున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోందని ఇండియన్ దళిత్ క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది పెరికే వరప్రసాద్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా సీఎం అడుగులు వేస్తుంటే దానిని కుట్రలతో తన సామాజిక వర్గ జడ్జిలతో పిల్లు వేయిస్తూ చంద్రబాబు అభివృద్ధికి ప్రతిబంధకంగా మారారన్నారు. దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టేరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు తన బినామీలైన సుజనాచౌదరి, పవన్ కల్యాణ్, వామపక్షాల నాయకులు, తన కుమారుడు లోకేష్ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. అమరావతి ఉద్యమానికి విదేశాల నుంచి వచ్చే వేల కోట్ల రూపాయలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనారాజు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాస్, ఎంఏసీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బేతపూడి సాంబయ్య, రాజధాని దళిత నాయకుల అధ్యక్షుడు నూతక్కి జోషి, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బొండపల్లి గిరిజ, అమరావతి రాజధాని రైతు కూలీల సంక్షేమ సంఘం కన్వీనర్ కట్టెపోగు ఉదయ్ భాస్కర్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొదమల కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దళిత సంఘాల నిరసన
దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కలెక్టరేట్ ఎదుట సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ దహనం సంగారెడ్డి క్రైం : దళితులపై దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ‘దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ’ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఐటీఐ నుంచి కలెక్టరేట్ వరకు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీతో శవయాత్ర జరిపి దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. దళితులపై దాడులు చేస్తున్న నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అట్రాసిటీ కేసులను నీరుగాస్తున్న సంగారెడ్డి, రామచంద్రాపురం డీఎస్పీలను సస్పెండ్ చేయాలన్నారు. మనోహర్‌గౌడ్ జెడ్పీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్గోయిలో 120 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన గ్రామ పెత్తందార్లను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ఈ ఘటన జరిగి నెల రోజులవుతున్నా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. సదరు గ్రామస్తులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దళితులపై దాడులు అరికట్టాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఐదు రోజులుగా దీక్షలు చేస్తున్నా మంత్రి హరీశ్‌రావు స్పందించకపోవడం శోచనీయమన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు బీరయ్య యాదవ్, ఎం.అనంతయ్య, కృష్ణంరాజు, దర్శన్, అడివయ్య, నవాజ్ మాదిగ, భూమి శ్రీనివాస్, బాలయ్య, విజయరావు, లక్ష్మయ్య, యాదగిరి, అర్జునయ్య, నిజామొద్దీన్, మురళి, రామారావు, నర్సింలు, ఎన్నార్, వెంకటేశం, డప్పు శ్రీనివాస్, ప్రశాంత్ యాదవ్, బి.కృష్ణ, వీరన్న, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.