Bipin Rawats Chopper Crash Video: ఆర్మీ హెలికాప్ట్టర్ ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు తీసిన వీడియో వాస్తవమేనా అన్న పరిశోధన సాగుతోంది. ఈ వీడియో చిత్రీకరించిన నాజర్ అనే వ్యక్తి వద్ద క్యూబ్రాంచ్ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. ఈమేరకు ఘటనా స్థలంలోని కార్మికుల వద్ద ఆదివారం విచారణ సాగింది. వివరాలు.. నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని ఆర్మీ హెలికాçప్టర్ కుప్పుకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన విషయం తెలిసిందే.
(చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!)
ఈ ఘటనపై ఓ వైపు ఆర్మీ వర్గాలు, మరోవైపు రాష్ట్ర పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో హెలికాప్ట్టర్ కుప్పకూలేందుకు ముందుగా చిట్ట చివరి దృశ్యం అంటూ ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం అన్నది పసిగట్టేందుకు క్యూబ్రాంచ్ రంగంలోకి దిగింది. విచారణను ముమ్మరం చేయగా, ఆ వీడియోను కోయంబత్తూరుకు చెందిన నాజర్ చిత్రీకరించినట్టు ఆదివారం వెలుగు చూసింది. దీంతో ఆయన వద్ద విచారణ జరుపుతున్నారు. తాము పరాట్యక ప్రాంత సందర్శనకు వెళ్లిన సమయంలో ఆ వీడియో చిత్రీకరించినట్టు ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.
అయితే, రైల్వే ట్రాక్ వైపుగా నడుచుకురావాల్సిన అవసరం ఏమిటో అన్న ప్రశ్నలతో నాజర్ వద్ద విచారణ చేపట్టారు. అలాగే, ఆయన సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ఆ వీడియో వాస్తవమేననా అన్నది నిగ్గుతేల్చేందుకు కోయంబత్తూరులోని పరిశోధన కేంద్రంలో çపరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్మీ వర్గాల నేతృత్వంలో సంఘటన జరిగిన ప్రదేశం పరిసరాల్లో మరోమారు పరిశీలన సాగింది. అయితే, ఆ పరిసరాల్లో 60 కుటుంబాలు ఉండగా, ఇందులో 12 మంది ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినట్టు సమాచారం. దీంతో హెలికాప్టర్ గాల్లో నుంచి కింద పడ్డ అనంతరం పేలిందా..? లేదా, గాల్లోనే ఏదేని మంటలు చెలరేగినట్టుగా కింద పడిందా...? అన్న కోణంలో వారిని ప్రశ్నించినట్లు సమాచారం.
పాకిస్తానీ ట్విట్టర్లపై చెన్నై సైబర్ క్రైం కేసు
పాకిస్తానీ ట్విట్టర్ ఖాతాదారులు పలువురిపై సీబీసీఐడీ సైబర్ క్రైం ఆదివారం కేసులు నమోదు చేసింది. బిపిన్‌రావత్ మరణం, హెలికాప్ట్టర్ ప్రమాద ఘటనపై పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ట్విట్టర్ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారం, ఆధార రహిత ఆరోపణలు, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే రీతిలో సంభాషణలు సాగినట్టు తమిళనాడు సీబీసీఐడీ అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ఖాతాలపై చర్యలకు తగ్గట్టు ట్విట్టర్ మీద ఒత్తిడి తెచ్చే విధంగా కేసులు నమోదు చేశారు.
(చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!)
Comments
Please login to add a commentAdd a comment