army air force
-
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ చితా...
-
ఆ వీడియో వాస్తవమేనా..?
Bipin Rawats Chopper Crash Video: ఆర్మీ హెలికాప్ట్టర్ ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు తీసిన వీడియో వాస్తవమేనా అన్న పరిశోధన సాగుతోంది. ఈ వీడియో చిత్రీకరించిన నాజర్ అనే వ్యక్తి వద్ద క్యూబ్రాంచ్ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. ఈమేరకు ఘటనా స్థలంలోని కార్మికుల వద్ద ఆదివారం విచారణ సాగింది. వివరాలు.. నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని ఆర్మీ హెలికాçప్టర్ కుప్పుకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన విషయం తెలిసిందే. (చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!) ఈ ఘటనపై ఓ వైపు ఆర్మీ వర్గాలు, మరోవైపు రాష్ట్ర పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో హెలికాప్ట్టర్ కుప్పకూలేందుకు ముందుగా చిట్ట చివరి దృశ్యం అంటూ ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం అన్నది పసిగట్టేందుకు క్యూబ్రాంచ్ రంగంలోకి దిగింది. విచారణను ముమ్మరం చేయగా, ఆ వీడియోను కోయంబత్తూరుకు చెందిన నాజర్ చిత్రీకరించినట్టు ఆదివారం వెలుగు చూసింది. దీంతో ఆయన వద్ద విచారణ జరుపుతున్నారు. తాము పరాట్యక ప్రాంత సందర్శనకు వెళ్లిన సమయంలో ఆ వీడియో చిత్రీకరించినట్టు ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, రైల్వే ట్రాక్ వైపుగా నడుచుకురావాల్సిన అవసరం ఏమిటో అన్న ప్రశ్నలతో నాజర్ వద్ద విచారణ చేపట్టారు. అలాగే, ఆయన సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ఆ వీడియో వాస్తవమేననా అన్నది నిగ్గుతేల్చేందుకు కోయంబత్తూరులోని పరిశోధన కేంద్రంలో çపరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్మీ వర్గాల నేతృత్వంలో సంఘటన జరిగిన ప్రదేశం పరిసరాల్లో మరోమారు పరిశీలన సాగింది. అయితే, ఆ పరిసరాల్లో 60 కుటుంబాలు ఉండగా, ఇందులో 12 మంది ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినట్టు సమాచారం. దీంతో హెలికాప్టర్ గాల్లో నుంచి కింద పడ్డ అనంతరం పేలిందా..? లేదా, గాల్లోనే ఏదేని మంటలు చెలరేగినట్టుగా కింద పడిందా...? అన్న కోణంలో వారిని ప్రశ్నించినట్లు సమాచారం. పాకిస్తానీ ట్విట్టర్లపై చెన్నై సైబర్ క్రైం కేసు పాకిస్తానీ ట్విట్టర్ ఖాతాదారులు పలువురిపై సీబీసీఐడీ సైబర్ క్రైం ఆదివారం కేసులు నమోదు చేసింది. బిపిన్‌రావత్ మరణం, హెలికాప్ట్టర్ ప్రమాద ఘటనపై పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ట్విట్టర్ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారం, ఆధార రహిత ఆరోపణలు, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే రీతిలో సంభాషణలు సాగినట్టు తమిళనాడు సీబీసీఐడీ అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ఖాతాలపై చర్యలకు తగ్గట్టు ట్విట్టర్ మీద ఒత్తిడి తెచ్చే విధంగా కేసులు నమోదు చేశారు. (చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!) -
Bipin Rawat: ఎంఐ హెలికాప్టర్.. మృత్యువుకి మరో పేరు.. 42 మందికి పైగా దుర్మరణం
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ చివరి సారిగా ఎంఐ 17 వీ 5 హెలికాప్టర్లో ప్రయాణం చేశారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఈ హెలికాప్టర్లు కీలకంగా ఉన్నాయి. ఒకేసారి 30 మంది ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ హెలికాప్టర్లు క్యారియర్లుగా ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే గత పదేళ్లుగా ఈ హెలికాప్టర్లు వరుసగా ప్రమాదాలు గురవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ హెలికాప్టర్ క్రాష్లలో 42 మందికి పైగా సైనికులను దేశం కోల్పోయింది. - 2021 డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన క్రాష్‌లో సీడీఎస్ బిపిన్ రావత్ ఆయన భార్య మధుళికతో కలిపి మొత్తం 14 మంది దుర్మరణం పాలయ్యారు. సీడీఎస్ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. - 2019 ఫిబ్రవరి 27న శ్రీనగర్ ఎయిర్ బేస్ స్టేషన్ నుంచి రోటీన్ వర్క్‌లో భాగంగా టేకాఫ్ అయిన విమానం పది నిమిషాలకే శ్రీనగర్ సమీపంలోని బుడ్గామ్ దగ్గర కూలింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు త్రీవంగా గాయపడ్డారు. - 2018 ఏప్రిల్ 18న ఉత్తర్ఖండ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు గుప్తకాశి నుంచి కేదార్నాథ్ బయల్దేరిన చాపర్ ల్యాండింగ్ సమయంలో సమస్యలు ఎదురయ్యాయి. పైలెట్లు ఏంతో నేర్పుగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఆరుగురు క్రూ క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు. - 2017 అక్టోబరు 6న అరుణాచల్ ప్రదేశ్‌లో వివాస్పద తవాంగ్ ఏరియాలో ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్యలతో అడవుల్లో కూలిపోయింది. సమయానికి సహాయ కార్యక్రమాలు కూడా అందలేదు. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు సిబ్బంది మరణించారు. - 2013 జూన్ 25 వదర సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్ కేథార్నాథ్ నుంచి గుప్తకాశికి వస్తుండగా గౌరీకుండ్ దగ్గర క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. - 2012 ఆగస్టు 30న గుజరాత్‌లోని ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన హెలికాప్టర్ కొద్ది సేపటికే ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ఘటనలో మొత్తం 9 మంది చనిపోయారు. - 2010 నవంబరు 19న తవాంగ్ నుంచి గువహాటికి బయల్దేరిన ఐదు నిమిషాలకే బొందిర్ అనే కొండల నడుమ హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. చదవండి:హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత -
హమ్మయ్య.. ఎగిరింది...!
సాంకేతిక లోపంతో ఇల్లెందులో దిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ వారం రోజులపాటు సిబ్బంది నిరీక్షణ మరమ్మతులు పూర్తవడంతో గమ్యానికి పయనం ఇల్లెందు, న్యూస్‌లైన్ ‘హమ్మయ్య... ఎగిరింది..’- ఇల్లెందులో వారం రోజుల నిరీక్షణ తరువాత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సిబ్బందిలో వ్యక్తమైన అనుభూతి ఇది. ఆర్మీ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన హెలికాప్టర్ (జె.4064) ఈ నెల 19న ఉదయం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని ఇల్లెందులోని సింగరేణి రన్స్ అండ్ గోల్స్ స్టేడియంలో పైలట్ సురక్షితంగా దింపారు. మరమ్మతుల కోసం బెంగుళూరు నుంచి మరుసటి రోజున సాంకేతిక సిబ్బంది వచ్చి పనులు మొదలుపెట్టారు. ఇవి బుధవారం పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 11:20 గంటల సమయంలో గాలి లోకి ఎగిరింది. కొద్దిసేపు ట్రయల్ చేసి, అంతా బాగుందని నిర్థారించుకున్నాక గమ్యస్థానానికి పంపించారు. దీంతో, ఎయిర్‌ఫోర్స్ అధికారులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇల్లెందులో నిలిచిన ఈ హెలికాప్టర్‌ను చూసేందుకు స్థానికులు, పరిసర గ్రామాల వాసులు ఈ వారం రోజులపాటు జాతరకు వచ్చినట్టుగా తరలివచ్చారు. వీరి తాకిడి ఎక్కువవడంతో గ్రౌండ్ ముఖద్వారం గేట్లను పోలీసులు మూసివేశారు.