Tamil Nadu IAF Helicopter Crash: The Chopper Which Was of Bipin Rawat Demise Mi 17 V5 Accident History - Sakshi
Sakshi News home page

Bipin Rawat: ఎంఐ హెలికాప్టర్‌.. మృత్యువుకి మరో పేరు.. 42 మందికి పైగా దుర్మరణం

Published Wed, Dec 8 2021 7:00 PM | Last Updated on Thu, Dec 9 2021 7:23 AM

The Chopper Which Was Of Bipin Rawat Demise Mi 17 V5 Accident History - Sakshi

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ చివరి సారిగా ఎంఐ 17 వీ 5 హెలికాప్టర్‌లో ప్రయాణం చేశారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఈ హెలికాప్టర్లు కీలకంగా ఉన్నాయి. ఒకేసారి 30 మంది ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ హెలికాప్టర్లు క్యారియర్లుగా ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే గత పదేళ్లుగా ఈ హెలికాప్టర్లు వరుసగా ప్రమాదాలు గురవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ హెలికాప్టర్‌ క్రాష్‌లలో 42 మందికి పైగా సైనికులను దేశం కోల్పోయింది. 

- 2021 డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన క్రాష్‌లో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ఆయన భార్య మధుళికతో కలిపి మొత్తం 14 మంది దుర్మరణం పాలయ్యారు. సీడీఎస్‌ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
-  2019 ఫిబ్రవరి 27న శ్రీనగర్‌ ఎయిర్‌ బేస్‌ స్టేషన్‌ నుంచి రోటీన్‌ వర్క్‌లో భాగంగా టేకాఫ్‌ అయిన విమానం పది నిమిషాలకే శ్రీనగర్‌ సమీపంలోని బుడ్‌గామ్‌ దగ్గర కూలింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు త్రీవంగా గాయపడ్డారు.
- 2018 ఏప్రిల్‌ 18న ఉత్తర్‌ఖండ్‌ ప్రభుత్వ ఆదేశాల మేరకు గుప్తకాశి నుంచి కేదార్‌నాథ్‌ బయల్దేరిన చాపర్‌ ల్యాండింగ్‌ సమయంలో సమస్యలు ఎదురయ్యాయి. పైలెట్లు ఏంతో నేర్పుగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఆరుగురు క్రూ క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు.
- 2017 అక్టోబరు 6న అరుణాచల్‌ ప్రదేశ్‌లో వివాస్పద తవాంగ్‌ ఏరియాలో ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్యలతో అడవుల్లో కూలిపోయింది. సమయానికి సహాయ కార్యక్రమాలు కూడా అందలేదు. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు సిబ్బంది మరణించారు.
- 2013 జూన్‌ 25  వదర సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్‌ కేథార్‌నాథ్‌ నుంచి గుప్తకాశికి వస్తుండగా గౌరీకుండ్‌ దగ్గర క్రాష్‌ అయ్యింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
- 2012 ఆగస్టు 30న గుజరాత్‌లోని ఎయిర్‌ బేస్‌ నుంచి బయల్దేరిన హెలికాప్టర్‌ కొద్ది సేపటికే ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ఘటనలో మొత్తం 9 మంది చనిపోయారు.
- 2010 నవంబరు 19న తవాంగ్‌ నుంచి గువహాటికి బయల్దేరిన ఐదు నిమిషాలకే బొందిర్‌ అనే కొండల నడుమ హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. 


చదవండి:హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌ కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement