హెలికాప్టర్‌ ప్రమాదం.. లోక్‌సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన | Rajnath Singh to Issue Statement on Chopper Crash that Killed Bipin Rawat | Sakshi
Sakshi News home page

Rajnath Singh: హెలికాప్టర్‌ ప్రమాదం.. లోక్‌సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన

Published Thu, Dec 9 2021 11:35 AM | Last Updated on Thu, Dec 9 2021 4:35 PM

Rajnath Singh to Issue Statement on Chopper Crash that Killed Bipin Rawat - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్‌ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో దేశ ప్రథమ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులికా రావత్‌తో పాటు మరో 11 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం లోక్‌సభలో ప్రకటన చేశారు. 
(చదవండి: Bipin Rawat: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్‌)

ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. 
►బుధవారం వెల్లింగ్టన్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది
►సూలూరు ఎయిర్‌ బేస్‌ నుంచి బుధవారం ఉదయం 11:48 గంటలకు హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయ్యింది.
►మధ్యాహ్నం 12:08 గంటలకుహెలికాప్టర్‌కు రాడార్‌ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి.
►కాసేపటికి హెలికాప్టర్‌ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారు. భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లారు.
►అప్పటికే హెలికాప్టర్‌ మంటల్లో ఉంది.
►గాయపడ్డవారిఇన సహాయక బృందాలు వెల్లింగ్టన్‌ ఆస్పత్రికి తరలించాయి. 
►హెలికాప్టర్‌ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. రావత్‌తో పాటు ఆయన భార్య మృతి చెందడం బాధాకరం.
►భౌతికకాయాలు గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరతాయి. 
►హెలికాప్టర్‌ ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది అని తెలిపారు. 

రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన అనంతరం లోక్‌సభ స్పీకర్‌ హోం బిర్లా, సభ్యులు బిపిన్‌ రావత్‌ సహా మిగతా వారి మృతికి సంతాపం తెలిపారు. 

చదవండి: బిపిన్‌ రావత్‌.. మాటలు కూడా తూటాలే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement