homage
-
పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (ఫిబ్రవరి 14) నివాళులర్పించారు. ‘పుల్వామాలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తున్నాను’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశం కోసం వారు చేసిన సేవలు, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. I pay homage to the brave heroes who were martyred in Pulwama. Their service and sacrifice for our nation will always be remembered. — Narendra Modi (@narendramodi) February 14, 2024 జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. పుల్వామా ఉగ్రదాడి 2019, ఫిబ్రవరి 14న జరిగింది. భారత్‌పై జరిగిన భారీ తీవ్రవాద దాడుల్లో ఇదొకటి. ఆ చీకటి రోజున ఉగ్రవాదులు 200 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యారు. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. ఆరోజు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లో 78 వాహనాలు ఉండగా, వాటిలో 2500 మందికి పైగా సైనికులు ప్రయాణిస్తున్నారు. -
కొమరంభీం జిల్లా జైనూర్ లో హైమన్ ధర్ఫ్ 36వ వర్థంతి సభ
-
అమరవీరుల దినోత్సవం.. సీఎం జగన్ నివాళులు
సాక్షి, అమరావతి: అమరవీరుల దినోత్సవం(మార్చి 23న) సందర్భంగా బుధవారం శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భగత్‌సింగ్ చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రి వనిత, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించిన ఎన్నారైలు
న్యూ జెర్సీ: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు న్యూజెర్సీలో సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది. న్యూజెర్సీ ఎడిసన్‌లో శివ, విష్ణు ఆలయంలో బిపిన్ రావత్ చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించింది. బిపిన్ రావత్‌తో పాటు సైన్యం లో సేవలందించిన రిటైర్డ్ కల్నల్ వీరేంద్ర ఎస్ తవాతియాఈ కార్యక్రమానికి వచ్చారు. బిపిన్ రావత్ తో తనకున్న అనుబంధాన్ని ఆయన స్మరించుకున్నారు. వీర సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసారు. ఈ సందర్భంగా సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, మాతా రాజ్యలక్ష్మి (స్పిరిట్యుయల్ గురు, కమ్యూనిటీ లీడర్), సాయి దత్త పీఠం బోర్డు సభ్యులు, ఆలయ భక్తులు, మాతృభూమి కోసం బిపిన్ రావత్ చేసిన సేవలను గుర్తు చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌తో పాటు మరణించిన ఇతర సైనికులందరికీ నివాళులు అర్పించారు. బిపిన్ రావత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు రఘు శర్మ శంకరమంచి తెలిపారు. -
హెలికాప్టర్ ప్రమాదం.. లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో దేశ ప్రథమ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్‌తో పాటు మరో 11 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం లోక్‌సభలో ప్రకటన చేశారు. (చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్) ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ►బుధవారం వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది ►సూలూరు ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం 11:48 గంటలకు హెలికాప్టర్ టేకాఫ్ అయ్యింది. ►మధ్యాహ్నం 12:08 గంటలకుహెలికాప్టర్కు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ►కాసేపటికి హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారు. భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లారు. ►అప్పటికే హెలికాప్టర్ మంటల్లో ఉంది. ►గాయపడ్డవారిఇన సహాయక బృందాలు వెల్లింగ్టన్ ఆస్పత్రికి తరలించాయి. ►హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. రావత్‌తో పాటు ఆయన భార్య మృతి చెందడం బాధాకరం. ►భౌతికకాయాలు గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరతాయి. ►హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది అని తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన అనంతరం లోక్‌సభ స్పీకర్ హోం బిర్లా, సభ్యులు బిపిన్ రావత్ సహా మిగతా వారి మృతికి సంతాపం తెలిపారు. చదవండి: బిపిన్ రావత్.. మాటలు కూడా తూటాలే -
ప్రజల గుండెల్లో నిలిచిన నేత డాక్టర్ వైఎస్సార్
అట్లాంట: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోందని అభిప్రాయపడ్డారు ప్రవాస భారతీయులు. సీఎం జగన్ సైతం తండ్రిగారి బాటలోనే నడుస్తున్నారని ప్రశంసించారు. జులై 11 ఆదివారం మధ్యాహ్నం అట్లాంటాలో వైయస్సార్ గారి జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సీడీసీ నిబంధనలు పాటిస్తూ రాజన్నకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ పాలన, ఆయన హయాంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఏపీలో సీఎం జగన్ పాలనలో జరుగుతున్న ప్రజా సంక్షేమ పథకాలు గురించి చర్చించారు. శ్రీనివాస్‌రెడ్డి కొట్లూరు, నంద గోపినాథ్‌రెడ్డి, వెంకటరామి రెడ్డి చింతంల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అట్లాంటాలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ఏ సభ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా భారీ ఎత్తున అభిమానులు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి జరిగిన 72వ జయంతి వేడుకలకు భారీగానే ఆయన అభిమానులు వచ్చారు. ఇందులో ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వాళ్లే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన అభిమానులు కూడా ఉండటం విశేషం. జననేత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కొంతమంది వక్తలు ప్రసంగిస్తూ.... వైఎస్సార్‌తో తమకున్న సాన్నిహిత్యం, ఆయన ద్వారా చేకూరిన లబ్ది, వారి ప్రాంతంలో అందిన సంక్షేమ ఫలాలు గురించి ప్రసంగించారు. -
పీవీ నర్సింహారావు వ్యక్తి కాదు ఒక శక్తి..
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 16వ వర్థంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు బుధవారం ఉదయం నివాళులు అర్పించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. పీవీ కుమార్తె వాణి, కుమారుడు పీవీప్రభాకర్ రావు హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ, పీవీ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కేశవరావు (కేకే), ఎమ్మెల్సీ కవిత తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా పీవీ ఆలోచనలు సూచనలు మన వెంట ఉన్నాయి. శత జయంతి ఉత్సవాలు సీఎం కేసీఆర్, ఎంపి కేకే ఆధ్వర్యంలో గొప్పగా జరుగుతున్నాయి. దేశానికి దిక్సూచి పీవీ. ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మంచి పరిణామం. ‘దేశానికి ఒక దిక్సూచి పీవీ నర్సింహారావు. భారత దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు. శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి. పీపీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎంపీ కేకే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన చేసిన సంస్కరణలు, ఆలోచనలు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఎన్నారైలు కోరుతున్నారు. మేం కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. పీవీ పేరుతో ఒక తపాల బిళ్లను విడుదల చేయాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. -
హృదయాలను కలిచి వేస్తోన్న ఫోటో
కశ్మీర్ : ఖాకీలనగానే కాఠిన్యం.. కరకు రాతి గుండెలున్న మనుషులుగా ఓ చిత్రం మన కళ్ల ముందు కదులుతుంది. కానీ విధి నిర్వహణలో భాగంగానే వాళ్లు అలా కఠినంగా ప్రవర్తిస్తారు. అనునిత్యం నేరస్తులతో కలిసి ఉండటం మూలానా వారి గుండెలు కూడా బండ బారిపోతాయేమో. అయితే ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోన్న ఓ ఫోటో చూస్తే ఖాకీలు కూడా అందరిలాంటి వారేనని వారికి కూడా స్పందించే హృదయం ఉంటుందని అర్థం అవుతుంది. ఓ ఉన్నతాధికారి.. చనిపోయిన సహోద్యోగి కుమారుడిని ఎత్తుకుని కన్నీటి పర్యంతమవుతున్న ఫోటో ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది వివరాలు.. గత వారం అనంతనాగ్‌లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో అర్షద్ ఖాన్ అనే పోలీసు అమరుడయ్యాడు. ప్రభుత్వ లాంఛనాలతో అతని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సుపరిండెంట్ ఆఫ్ పోలీస్ హసీబ్ ముఘల్ హాజరయ్యారు. ఈ క్రమంలో హసీబ్, మరణించిన అర్షద్ ఖాన్ నాలుగేళ్ల కుమారుడు ఉబన్‌ను ఎత్తుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్లో వైరలవుతూ ఎంతో మందిని కదిలిస్తోంది. ముష్కరులకు, భద్రతా దళాలలకు మధ్య జరిగిన కాల్పుల్లో అర్షద్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. కానీ దురదృష్టవశాత్తు రెండు రోజుల క్రితం అర్షద్ మరణించాడు. శ్రీనగర్‌కు చెందిన అర్షద్‌కు ఇద్దరు కుమారులున్నారు. వీరితో పాటు తల్లిదండ్రులు, సోదరుడు కూడా అర్షద్ మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. అర్షద్ మరణంతో ‘పెద్ద దిక్కును కోల్పోయాం.. ఇక మేమెలా బతకాలి’ అంటూ ఆ కుటుంబ సభ్యులు చేస్తోన్న ఆక్రందనలు అక్కడి వారి హృదయాలను కలిచి వేశాయి. -
దాసరికి వైఎస్ఆర్సీపీ నేతల సంతాపం
-
దాసరికి సినీ ప్రముఖుల సంతాపం
-
దాసరికి సినీ,రాజకీయ ప్రముఖుల సంతాపం
-
దివి ఉప్పెన ఓ దుర్దినం
అవనిగడ్డ : 1977 ఉప్పెన దివిసీమకు దుర్దినమని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గాంధీక్షేత్రంలో శనివారం ఉప్పెన మృతుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఉప్పెన అనంతరం దివిసీమ పునరుజ్జీవనానికి దాతల సేవలు మరువలేనివన్నారు. దివిసీమకు రక్షణ కల్పించేందుకు విస్తృతంగా మడ అడవుల పెంపకం, ఇంటింటా చెట్లు పెంచే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మండవ బాలవర్థిరావు, కేడీసీసీ డైరెక్టర్ ముద్దినేని చంద్రరావు, జెడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు అన్నపరెడ్డి సత్యనారాయణ, నాయకులు మత్తి శ్రీనివాసరావు, బచ్చు వెంకటనాథ్, యాసం చిట్టిబాబు, గాజుల మురళీకృష్ణ, పంచకర్ల స్వప్న పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో.. 1977 ఉప్పెన మృతులకు దివిసీమలో పలు పార్టీలకు చెందిన నాయకులు శనివారం ఘనంగా నివాళులర్పించారు. పలుచోట్ల కొవ్వొత్తులతో నివాళులర్పించగా, మరికొన్నిచోట్ల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో నాయకులు పులిగడ్డ పైలాన్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, జిల్లా కార్యదర్శి రాజనాల మాణిక్యాలరావు, అవనిగడ్డ పట్టణ కన్వీనర్ అన్నపరెడ్డి రాందాస్, నాయకులు చింతలపూడి లక్ష్మీనారాయణ, కేజీ నాగేశ్వరరావు, గరికపాటి కృష్ణ, సుదర్శన్, నలుకుర్తి నగధర్, రాకేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ మత్తి వెంకటేశ్వరరావు నేతృత్వంలో పులిగడ్డ పైలాన్ వద్ద నివాళులర్పించారు. కాగా, ఉప్పెన మృతుల ఆత్మకు శాంతి కలగాలని మండల పరిధిలోని కోటగిరిలంక ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
ఇడుపులపాయలో ఘనంగా వైఎస్ జయంతి
నివాళులర్పించిన వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల, కుటుంబ సభ్యులు వేంపల్లె: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి సందర్భంగా శుక్రవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ జనసంద్రమైంది. ఉదయం 8.30 గంటలకు వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్‌కుమార్, వైఎస్ మనుమడు వైఎస్ రాజారెడ్డి, మనుమరాళ్లు వర్ష, హర్ష, అంజలిలతో కలిసి ఘాట్‌కు చేరుకున్నారు. ఫాదర్ రెవరెండ్ డాక్టర్ నరేష్‌బాబు, రెవరెండ్ బెన్హర్, పాస్టర్ మృత్యుంజయరావులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భౌతికంగా వైఎస్ మన మధ్య లేకపోయినా.. ఎప్పటికీ అందరి హృదయాల్లో నిలిచి ఉంటారని, మహానేత ప్రేమకు ప్రతిరూపమని కుటుంబ సభ్యులందరూ స్మరించుకున్నారు. వైఎస్ ఘాట్‌పై పూల మాలలు ఉంచి, ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళుల ర్పించారు. వైఎస్ సోదరులు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతి, ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు దినేష్‌రెడ్డి, వైఎస్ మేనత్త కమలమ్మ, సోదరి విమలమ్మ, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన సతీమణి సమత, ఎమ్మెల్యేలు అంజాద్‌బాషా, శ్రీకాంత్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు, ప్రజలు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. -
మహానేతకు ఘన నివాళి
-
రవీంద్రుడికి అంజలి ఘటించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : విశ్వకవి, నోబెల్ అవార్డు గ్రహీత, రవీంద్రనాథ్ ఠాకూర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఘనంగా అంజలి ఘటించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 155వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. 'గురుదేవ్ ఠాకూర్‌కు అభివాదం చేస్తున్నా. ఆయన రచనలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయి' అని మోదీ ట్విట్ చేశారు. కాగా, రవీంద్రనాథ్ ఠాగూర్ మే 7, 1861న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కటాలోజన్మించారు. 1941, ఆగస్టు 7న పరమపదించారు. ఠాగూర్ సాహిత్యానికి చేసిన సేవకు గుర్తింపుగా ఆయనకు 1931లో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. -
రాజ్ నాథ్‌ను నిలదీసిన యువతి
-
రాజ్ నాథ్‌ను నిలదీసిన యువతి
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఓ యువతి నిలదీసింది. భోరుమని ఏడుస్తూ పలుమార్లు ప్రశ్నించింది. ఎప్పుడు తామే ఏడుస్తూ ఉండాలా? తమకే ఎందుకు ఈ పరిస్థితి అంటూ విలపించింది. ఢిల్లీలోని విమానాశ్రయానికి సమీపంలో బీఎస్ఎఫ్ కు చెందిన సూపర్ కింగ్ చిన్న విమానం కూలిపోయి ముగ్గురు బీఎస్ఎఫ్ అధికారులతో సహా పదిమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బుధవారం వారి అంత్యక్రియలు సందర్భంగా సఫ్దార్ జంగ్ విమానాశ్రయానికి వచ్చి చనిపోయిన జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చనిపోయినవారిలో కో పైలెట్ శివరెయిన్ కుటుంబానికి చెందిన ఓ యువతి నేరుగా రాజ్ నాథ్పైకి ప్రశ్నలు సంధించింది. 'సర్, ఎప్పుడూ సైనికుల కుటుంబాలే ఎందుకు ఏడవాలి? చెప్పండి సర్ ఇలా ఎందుకు? వీఐపీల విమానాల్లో ఎందుకు ఇలా జరగదు? సైనికులకు ఎందుకు పాత విమానాలు ఇస్తున్నారు? నిన్న కూలిపోయిన విమానం చాలా పాతది. అలా ఇవ్వడం సరికాదు. మీరు సమాధానం చెప్పాలి. నాకు సమాధానం కావాలి' అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ ప్రశ్నించింది. ఈలోగా ఆమెను అక్కడ ఉన్న కొందరు వెనక్కి లాగారు. అనంతరం చనిపోయిన కో పైలెట్ భార్య మాట్లాడుతూ బీఎస్ఎఫ్ విభాగానికి కొత్త విమానాలు కావాల్సిన అవసరం ఉందని తన భర్త చెప్పేవారని, ఈ విమానం ఎంతోకాలం నుంచి వాడుతున్నామని చెప్పారని అన్నారు. అందుకే గత ఏడాది ఆ విమానం వాడేందుకు ఆయన పలుమార్లు నిరాకరించారని చెప్పారు. ఈ విమానం పాతది అవడం వల్లే సమస్య తలెత్తి అది కూలిపోయినట్లు తాను రాజ్ నాథ్ సింగ్ కు చెప్పినట్లు కోపైలెట్ రాజెష్ శివరాన్ మామ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
'వారికి సెల్యూట్ చేస్తూనే ఉంటాను'
న్యూఢిల్లీ: పార్లమెంటుపై దాడి జరిగిన ఘటనలో పాకిస్థాన్ ముష్కరులకు ఎదురొడ్డి పోరాడి అమరులైనవారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై దాడి జరిగి పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నాటి అమరవీరులకు అంజలి ఘటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. దాడి సమయంలో ధీటుగా పోరాడి పార్లమెంటులోకి ఉగ్రవాదులను అడుగుపెట్టకుండా చేసి ప్రాణాలు తృణపాయంగా వదిలేసిన వారి త్యాగాలకు తానెప్పుడూ సెల్యూట్ చేస్తూనే ఉంటానని అన్నారు. వారి త్యాగం భారత్ ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. తమ ప్రభుత్వం దేశంలో అసహనాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ఉగ్రవాదాన్ని రూపు మాపేందుకు నిరంతరం కృశిచేస్తుందని అన్నారు. భారత్ ను మరింత సురక్షితమైన దేశంగా మార్చేందుకు, మరింత లౌకిక రాజ్యంగా తీర్చి దిద్దేందుకు అనునిత్యం ప్రయత్నిస్తామని అన్నారు. -
నాటి వీరులకు ఘన నివాళి
న్యూఢిల్లీ: పార్లమెంటుపై 2001, డిసెంబర్ 13న పాకిస్థాన్ ముష్కరులు జరిపిన దాడిని ధీటుగా ఎదుర్కొని అమరవీరులైన వారికి దేశం ఆదివారం ఘన నివాళి అర్పించింది. ఆదివారం పార్లమెంటు భవన్ వద్ద అమరవీరుల చిత్రపటాలకు ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్, రాజ్యసభ స్పీకర్ కురియన్ తోపాటు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, గులాంనబీ అజాద్, ఇతర బీజేపీ, కాంగ్రెస్ నేతలు అమరుల చిత్రపటాలపై పూలు జల్లి నివాళులు అర్పించారు. బీజేపీ నేత అద్వానీ కూడా నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్బంగా నాటి మృతవీరుల కుటుంబాల సభ్యులు అద్వానీని మర్యాదపూర్వకంగా కలిశారు. -
విద్యానృసింహ స్వామికి వైఎస్ జగన్ నివాళి
-
విద్యానృసింహ స్వామికి వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్: పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్ధండ విద్యానృసింహ భారతీస్వామి భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం శ్రద్ధాంజలి ఘటించారు. బేగంపేటలో పుష్పగిరి భారతి వేద పాఠశాలలో ఉంచిన భారతీస్వామి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గుండెపోటుతో ఆదివారం మధ్యాహ్నం 3.45కి బషీర్‌బాగ్ అపోలో ఆస్పత్రిలో భారతీస్వామి తుది శ్వాస విడిచారు. కడప జిల్లా పుష్పగిరిలోని కేంద్ర స్థానంలోమంగళవారం శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు జరుగుతాయని స్వామి వ్యక్తిగత కార్యదర్శి ఎన్.భారతీస్వామి తెలిపారు. కడపజిల్లా చెన్నూరులో 1940లో జన్మించిన భారతీస్వామి 1957లో పుష్పగిరి పీఠం బాధ్యతలు చేపట్టారు. దక్షిణ భారత దేశంలోనే సుదీర్ఘంగా 60 ఏళ్ల పాటు కొనసాగిన ఏకైక పీఠాధిపతిగా ఘనతకెక్కారు. పీఠాధిపతిగా అరవయ్యో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ‘షష్ట్యబ్ది ఉత్సవం’ చేయాలని పూనుకున్న తరుణంలో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు. -
'మొక్కలు నాటడమే వారికి మంచి నివాళి'
న్యూఢిల్లీ: మొక్కలు నాటడం ద్వారా దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీర జవానులకు మంచి శ్రద్ధాంజలి ఘటించినట్లవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అన్నారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంకోసం పాటుపడిన ప్రతిఒక్కరిని స్మరించుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటడం ద్వారా వారికి మంచి నివాళి ఇచ్చినట్లవుతుందని చెప్పారు. శుక్రవారం ఆయన మూడు కోర్టుల వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నిధులు కాస్తంత ఎక్కువేనని, సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలు అదనం అని చెప్పారు. అలాంటి ఢిల్లీలో పనిచేసేందుకు అనువైన వాతావరణం తయారుచేసుకోవడం ఒక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా అది సాధ్యమవుతుందని వివరించారు సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు. -
హిరోషిమా ఘటనలో మృతులకు ప్రధాని నివాళి
న్యూఢిల్లీ: హిరోషిమాపై ఘోర అణుబాంబు ప్రయోగానికి నేటికి 70 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జపాన్‌లో హిరోషిమా ఘటనలో మృతిచెందిన వారందరికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. ఆ రోజు జరిపిన బాంబుదాడి, యుద్ధాల వల్ల సంభవించే భయంకరమైన దృశ్యాలను గుర్తుకు తెస్తుందన్నారు. దాడుల వల్ల మానవత్వం మీద పడే ప్రభావం ఆ బాంబుదాడితో అర్థం అవుతుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. 1945 సంవత్సరం ఆగస్టు ఆరో తేదీన అగ్రదేశం అమెరికా జపాన్‌పై ఈ అణుబాంబు దాడి జరిపింది. ఈ దాడి జరిగిన క్షణాల్లోనే హిరోషిమా నగరం నేలమట్టమైంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అణుబాంబు దాడికి ఇదే. ఆ తర్వాత అదే ఏడాది తొమ్మిదిన నాగసాకిపై అమెరికా రెండో అణు బాంబును ప్రయోగించి ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ప్రధాన స్థావరంగా హిరోషిమా నగరం ఉండేది. అందుకే ఈ నగరంపై అమెరికా కన్నుపడింది. ఫలితంగానే అమెరికా 1945, ఆగస్టు ఆరో తేదీన ఉదయం బి-29 అనే బాంబర్ విమానం ద్వారా అణుబాంబును హిరోషిమాపై వేసింది. ఇలా మొదటిసారిగా అణుబాంబు ద్వారా ధ్వంసం చేసిన తొలి నగరంగా హిరోషిమా ప్రపంచ చరిత్ర పుటలకెక్కింది. అణుబాంబు దాడి జరిగిన కొన్ని క్షణాల్లోనే 70 వేల మందికి పైగా మరణించగా, అణుధూళి వల్ల మరో 90 వేల నుంచి లక్షా 40 వేల మంది మరణించినట్లు గణాంకాలు చెపుతున్నాయి. నేటికి ఈ సంఘటన జరిగి సరిగ్గా 70 సంవత్సరాలు. 1955 నాటికి పూర్తిగా కోలుకున్న ఈ నగరం.. అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. My homage to all those who lost their lives in Hiroshima. The bombings remind us of the horrors of war & their effect on humanity. — Narendra Modi (@narendramodi) August 6, 2015 -
'సినీ పరిశ్రమ గొప్ప వ్యక్తిని కోల్పోయింది'
-
నిజమైన దిక్పాలకులు
బౌద్ధవాణి మగధకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారి కొడుకు సింగాలకుడు. రోజూ క్రమం తప్పకుండా నగరం వెలుపలగల కోనేటిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చి, దిక్కు దిక్కుకు తిరిగి సాష్టాంగ ప్రణామాలు చేస్తాడు. ఒక రోజున నమస్కరించి కళ్ళు తెరిచే సరికి ఎదురుగా చిరునవ్వుతో బుద్ధుడు కన్పించాడు. భక్తితో బుద్ధునికి నమస్కరించాడు సింగాలకుడు. ‘‘సింగాలకా! ఎవరికి నమస్కరిస్తున్నావు?’’ అని అడిగాడు బుద్ధుడు.‘‘భగవాన్! రోజూ ఆరు దిక్కులకు నమస్కరిస్తున్నాను’’ అన్నాడు సింగాలకుడు. ‘‘మంచిది సింగాలకా! దిక్కులకు ఎందుకు నమస్కరించాలో తెలుసా?’’ ‘‘ఆరు దిక్కులకూ ఆరుగురు దిక్పాలకులుంటారో గదా! వారికే నమస్కరిస్తున్నా!’’ అని ఏయే దిక్కుకు ఎవరెవరు అధిపతులో చెప్పాడు సింగాలకుడు. బుద్ధుడు నవ్వి...‘‘సింగాలకా! నీవు చెప్పిన వారికంటే గొప్ప దిక్పాలకులున్నారు. తూర్పు దిక్కుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, దక్షిణ దిక్కుకు మనకు విద్యాబుద్ధులు నేర్పే గురువు, పశ్చిమానికి భార్యా-బిడ్డలు, ఉత్తర దిశకు మిత్రులు అధిపతులు. ఉద్యోగులు శ్రామికులు అధోదిశకు, పండితులు ఊర్ధ్వదిశకు ప్రతీకలు కాబట్టి వారికి నమస్కరించు. వీళ్లే నిజమైన దిక్పాలకులు’’ అని చెప్పాడు బుద్ధ భగవాన్. ‘‘అలాగే భగవాన్’’ అని వినయంగా పలికాడు సింగాలకుడు. - బొర్రా గోవర్ధన్ -
ఇడుపులపాయలో వైఎస్‌కు ఘన నివాళి
-
ఇడుపులపాయలో వైఎస్‌కు ఘనంగా నివాళులు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి, మహానేత సతీమణి వైఎస్ విజయమ్మ, రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సమీప బంధువులు, అభిమానులు పెద్ద ఎత్తున వైఎస్ స్మృతివనానికి చేరుకున్నారు. చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు అక్కడకు వస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృత్యర్థం పార్టీ కార్యకర్తలు జిల్లాలోను, రాష్ట్రవ్యాప్తంగా కూడా పలు కార్యక్రమాలు చేపట్టారు. రోగులకు పండ్లు పంచిపెడుతున్నారు. పార్టీ కార్యాలయాల్లోనూ వైఎస్ జయంతి ఘనంగా జరుగుతోంది. -
బీజేపీ ఆఫీసులో ముండేకు ప్రముఖుల నివాళి
-
సుబ్బన్న ఇక లేరు
-
ధర్మవరపు మృతిపట్ల జగన్ సంతాపం
-
ధర్మవరపు మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హాస్యానికి చిరునామాగా ధర్మవరపు తన జీవితాన్ని గడిపారని, తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ధర్మవరపు కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ధర్మవరపు కుటుంబ సభ్యులను 'సాక్షి' చైర్పర్సన్ వైఎస్ భారతి పరామర్శించారు. ఆయన మృతి టాలీవుడ్‌తో పాటు తెలుగులోకానికి తీరని లోటని ఆమె అన్నారు.