న్యూఢిల్లీ : విశ్వకవి, నోబెల్ అవార్డు గ్రహీత, రవీంద్రనాథ్ ఠాకూర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఘనంగా అంజలి ఘటించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 155వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. 'గురుదేవ్ ఠాకూర్కు అభివాదం చేస్తున్నా. ఆయన రచనలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయి' అని మోదీ ట్విట్ చేశారు. కాగా, రవీంద్రనాథ్ ఠాగూర్ మే 7, 1861న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కటాలోజన్మించారు. 1941, ఆగస్టు 7న పరమపదించారు. ఠాగూర్ సాహిత్యానికి చేసిన సేవకు గుర్తింపుగా ఆయనకు 1931లో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు.
రవీంద్రుడికి అంజలి ఘటించిన ప్రధాని మోదీ
Published Sat, May 7 2016 10:17 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement