ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హాస్యానికి చిరునామాగా ధర్మవరపు తన జీవితాన్ని గడిపారని, తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ధర్మవరపు కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
ధర్మవరపు కుటుంబ సభ్యులను 'సాక్షి' చైర్పర్సన్ వైఎస్ భారతి పరామర్శించారు. ఆయన మృతి టాలీవుడ్‌తో పాటు తెలుగులోకానికి తీరని లోటని ఆమె అన్నారు.