Dharmavarapu subrahmanyam
-
ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోయాక కడసారి చూసేందుకు వచ్చింది వీళ్లే!
కామెడీలో కొత్త ఒరవడి సృష్టించిన వ్యక్తి ధర్మవరపు సుబ్రహ్మణ్యం. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాల్లోనూ నటించేవారు. తానొక స్టార్ కమెడియన్ అయినా సరే, ఎప్పుడూ పారితోషికం డిమాండ్ చేసేవారు కాదట, నిర్మాతలు ఎంతిస్తే అంత తీసుకునేవారట. ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని కొందరు నిర్మాతలు డబ్బు ఎగ్గొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆనాటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం తనయుడు రవి బ్రహ్మ తేజ. తాజాగా రవి బ్రహ్మ తేజ మాట్లాడుతూ.. 'మా నాన్న మంచితనాన్ని అలుసుగా తీసుకుని మోసం చేసిన నిర్మాతలు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నారు. అప్పుడు నిజాయితీగా వ్యవహరించి ఉంటే వారి బతుకులు బాగుండేవి. వెండితెరపై అనేక పాత్రలు పోషించిన నాన్న 2013లో చనిపోయారు. ఆయన పార్థివదేహం ఇంట్లో ఉన్నప్పుడు తనను చివరి చూపు చూసేందుకు మూవీ మొఘల్ రామానాయుడు, హీరో గోపీచంద్, రాజేంద్రప్రసాద్, అలీ, వేణుమాధవ్ సహా తదితరులు వచ్చారు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ చూసేందుకు రాలేదు. వచ్చేందుకు ప్రయత్నించారట, కానీ వీలు కాలేదని తెలిసింది. ఇకపోతే నాన్న ముందస్తుగా మాకేమీ చెప్పలేదు కాబట్టి ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌కు పంపించలేదు. మా ఇంటి నుంచి నాన్న పార్థివ దేహాన్ని ఊరికి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు నిర్వహించాం' అని చెప్పుకొచ్చాడు. కాగా 1954లో జన్మించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా నవ్వులు పూయించారు. మరీ ముఖ్యంగా లెక్చరర్ పాత్రల్లో తను పండించే కామెడీకి ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవారు. స్టార్ కమెడియన్‌గా రాణించిన ఆయన కాలేయ క్యాన్సర్‌తో 2013 డిసెంబర్ 7న కన్నుమూశారు. చదవండి: సాయిధరమ్ తేజ్ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, కలవలేదు: అబ్దుల్ ఓటీటీలోకి వచ్చేసిన దసరా -
బ్రహ్మానందాన్ని ఇంటికి రానివ్వని ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎందుకంటే?
ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. ఆయన సజీవంగా లేకపోయినా వెండితెరపై ఆయన పంచిన నవ్వులు మాత్రం కలకాలం గుర్తుండిపోతాయి. అబ్బే.. మాక్కూడా తెలుసు బాబూ.. అంటూ ఆయన నోటి నుంచి జారిన మాటల విరుపులు చాలు పెదవులు చిరునవ్వుతో విచ్చుకోవడానికి! ఎక్కువగా లెక్చరర్ పాత్రల్లో కామెడీ పండించిన ఆయన యజ్ఞం, ఆలస్యం అమృతం సినిమాలకు ఉత్తమ కమెడియన్‌గా నంది అవార్డులు అందుకున్నారు. 1954లో జన్మించిన ఆయన 2013లో కాలేయ క్యాన్సర్‌తో కన్నుమూశారు. తాజాగా ఆయన తనయుడు రవి బ్రహ్మ తేజ.. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. (మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రం.. నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ నాన్న!) 'మా నాన్న కష్టమనేది తెలియకుండా పెంచారు. ఆయన సంపాదించిన ఆస్తి వల్లే మేమిప్పటికీ సంతోషంగా ఉన్నాం. ఇదంతా ఆయనిచ్చిందే! 2001లో 'నువ్వు నేను' సక్సెస్ పార్టీకి వెళ్లొస్తున్న సమయంలో నాన్నకు యాక్సిడెంట్ అయింది. బస్సు నాన్న కారు మీదకు ఎక్కి దిగింది. అక్కడున్నవాళ్లు నాన్నను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆయన బతికిబట్టకట్టారు. నాన్న తలపై 21 కుట్లు, కుడి చేతికి సర్జరీ చేసి రాడ్స్ వేశారు. ఆ తర్వాత 2005లో నాన్న ఉన్నట్లుండి అనారోగ్యానికి లోనయ్యారు. సిగరెట్‌కు బానిస కావడంతో లంగ్స్ పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు. పదిరోజులపాటు కోమాలో ఉన్నారు. అలా రెండుసార్లు నాన్నను కాపాడుకున్నాం, కానీ మూడోసారి కాపాడుకోలేకపోయాం. 2012 దీపావళి తర్వాత ఆయన ఆరోగ్యం దిగజారింది. లివర్ క్యాన్సర్ నాలుగో స్టేజీ అని చెప్పారు. 11 నెలల కంటే ఎక్కువ బతకరని చెప్పారు. బ్రహ్మానందం నాన్నకు తరచూ ఫోన్ చేసి మాట్లాడేవారు. ఒక్కసారి ఇంటికి వచ్చి చూస్తానంటే నాన్న ఒప్పుకునేవాడు కాదు. నన్ను చూస్తే తట్టుకోలేవు, ఆరు నెలలు ఆగు, నేనే వస్తా, మళ్లీ షూటింగ్ చేద్దాం అన్నారు. కానీ అంతలోనే 2013 డిసెంబర్ 7న ఆయన చనిపోయారు. నాన్న చనిపోయినప్పుడు బ్రహ్మానందం ఇంటికి రాలేదు కానీ ఫిలించాంబర్‌లో చాలా ఏడ్చారు' అని చెప్పుకొచ్చాడు రవి బ్రహ్మ తేజ. (సుధా కొంగర దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా!) -
ధర్మవరపు సుబ్రమణ్యం వర్ధంతి
చైతన్యపురి: ప్రముఖ హాస్య నటుడు, దివంగత ధర్మవరపు సుబ్రమణ్యం ప్రధమ వర్ధంతిని బుధవారం ఉదయం దిల్సుఖ్నగర్ శారదానగర్‌లోని ఆయన నివాసంలో నిర్వహించనున్నారు. అనారోగ్య కారణంగా గత సంవత్సరం డిసెంబర్ 7న చైతన్యపురిలోని ఓ ఆసుపత్రిలో ఆయన మరణించారు. ప్రకాశం జిల్లా కొమ్మినేని పాలెం గ్రామంలో జన్మించిన ధర్మవరపు ‘ఆనందోబ్రహ్మ’ సీరియల్ ద్వారా నటుడుగా పరిచయమై ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. వర్ధంతి సభకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని కుటుంబ సభ్యులు తెలిపారు.అశోక్‌నగర్‌లోని సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి సుబ్రమణ్యేశ్వర షష్టి కల్యాణ మహోత్సవం. -
సుబ్బన్న ఇక లేరు
-
ధర్మవరపు మృతిపట్ల జగన్ సంతాపం
-
ధర్మవరపు మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హాస్యానికి చిరునామాగా ధర్మవరపు తన జీవితాన్ని గడిపారని, తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ధర్మవరపు కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ధర్మవరపు కుటుంబ సభ్యులను 'సాక్షి' చైర్పర్సన్ వైఎస్ భారతి పరామర్శించారు. ఆయన మృతి టాలీవుడ్‌తో పాటు తెలుగులోకానికి తీరని లోటని ఆమె అన్నారు.