మొక్కలు నాటడం ద్వారా దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీర జవానులకు మంచి శ్రద్ధాంజలి ఘటించినట్లవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అన్నారు.
న్యూఢిల్లీ: మొక్కలు నాటడం ద్వారా దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీర జవానులకు మంచి శ్రద్ధాంజలి ఘటించినట్లవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అన్నారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంకోసం పాటుపడిన ప్రతిఒక్కరిని స్మరించుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటడం ద్వారా వారికి మంచి నివాళి ఇచ్చినట్లవుతుందని చెప్పారు.
శుక్రవారం ఆయన మూడు కోర్టుల వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నిధులు కాస్తంత ఎక్కువేనని, సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలు అదనం అని చెప్పారు. అలాంటి ఢిల్లీలో పనిచేసేందుకు అనువైన వాతావరణం తయారుచేసుకోవడం ఒక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా అది సాధ్యమవుతుందని వివరించారు సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు.