Live Updates:
06:10 PM
హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి చెందినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది.
With deep regret, it has now been ascertained that Gen Bipin Rawat, Mrs Madhulika Rawat and 11 other persons on board have died in the unfortunate accident.
— Indian Air Force (@IAF_MCC) December 8, 2021
05:45 PM
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్ని పర్యటనలు రద్దు చేసుకున్నారు. మహారాష్ట్రలోని కొత్త దర్బార్ హాల్‌ను ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి హాజరుకావాల్సి ఉంది. ప్రస్థుత పరిస్థితుల దృష్ట్యా పర్యటనను రద్ధు చేసుకున్నట్లు సమాచారం.
05:18 PM
►సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహరాల కేబినెట్ కమిటీ భేటీ జరగనుంది. ప్రధాని మోడీ నివాసంలో సిసిఎస్ సమావేశం జరగనుంది.
05:03 PM
హెలికాప్టర్‌లో 14 మంది ప్రయాణం చేస్తుండగా, 13 మంది మృతిచెందారు. ప్రమాదంలో రావత్ భార్య మధులిక కన్నుమూశారు. సీడీఎస్ బీపీన్ రావత్ గాయాలతో బయటపడ్డారు. హుటాహుటిన రావత్‌ను ఆసుపత్రికి తరలించారు. వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో రావత్‌కు చికిత్స అందిస్తున్నారు.
04:50 PM
►బిపిన్ రావత్‌కు అత్యవసర చికిత్స
04:20 PM
►సూలూరు ఎయిర్‌బేస్‌కు బయల్దేరిన ఎయిర్ చీఫ్ మార్షల్
►కాసేపట్లో సూలూరు ఎయిర్‌బేస్‌కు ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి
04:10PM
►హెలికాప్టర్ ప్రమాదంపై గురువారం పార్లమెంట్‌లో ప్రకటన
►ప్రమాద ఘటనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న రక్షణ శాఖ మంత్రి
03:50PM
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలడంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. తనకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం బిపిన్‌రావత్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
03:44PM
►బిపిన్‌రావత్ ఇంటికి కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
03:34PM
►ప్రమాదానికి వాతావరణం కానీ, సాంకేతిక లోపం కానీ కారణమై ఉండొచ్చని ఎక్స్ ఎమ్‌ఐ-17 పైలెట్ అమితాబ్ రంజన్ అన్నారు.
03:25PM
హెలికాప్టర్ ప్రమాదంపై సందేహాలు..
1. ప్రతికూల వాతావరణమా?
2. సాంకేతిక లోపలా..?
3. హెలికాప్టర్ విద్యుత్ తీగలకు తాకిందా..?
4. తక్కువ ఎత్తులో ప్రయాణించిందా..?
5. విజిబులిటీ లేకపోవడమా..?
03:20PM
ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. పెద్ద శబ్దాలు వినిపించడంతో ఏం జరిగిందో చూడటానికి ఇంటి నుంచి బయటకు రాగా ఛాపర్ చెట్టును ఢీ కొంటూ, మంటలు చెలరేగడం, మరో ముగ్గురుని ఢీ కొట్టడం కళ్లారా చూశాను. వెంటనే ఇరుగుపొరుగువారికి, అధికారులకు సమాచారం అందించాను. ప్రమాద సమయంలో హెలికాప్టర్ నుంచి అనేక మృతదేహాలు పడటం చూశాను.
03:15PM
►కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సమావేశం అనంతరం ఘటనాస్థలికి వెళ్లనున్న రాజ్‌నాథ్
03:05PM
వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలిపోయింది. ప్రమాదానికి గురైన హెలీకాప్టర్‌లో సీడీఎస్ బిపిన్‌రావత్‌తో సహా ఆయన భార్య మధులిక, మరికొందరు కుటుంబసభ్యులు, సీడీఎస్ సిబ్బంది ఉన్నట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన సహాయ సిబ్బంది ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. మిగతా 11 మంది దుర్మరణం పాలైనట్టు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. హెలికాప్టర్ సామర్థ్యం 24 మంది.
02:53PM
తమిళనాడు సీఎం ఆరా..
హెలికాప్టర్ ప్రమాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరా తీశారు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
02:23PM
కేబినెట్ భేటీ..
బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందన్న విషయం తెలిసిన వెంటనే కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ అయ్యింది.
02:04PM
ప్రధాని సమీక్ష..
హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రమాద వివరాలను మోదీకి వివరించారు. స్పందించారు. రాజ్‌నాథ్ సింగ్ ప్రమాదం గురించి పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నారు.
Tamil Nadu Army Helicopter Crash Telugu Live Updates: తమిళనాడులో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఐఏఎఫ్ ఎంఐ-17 హెలికాప్టర్ కూనూరు వద్ద అటవీ ప్రాంతంలో కుప్ప కూలింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. కాగా, భారత వాయుసేన ప్రమాదాన్ని అధికారంగా ధ్రువీకరించింది. విచారణకు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment