
చెన్నై: తమిళనాడులోని కున్నూరులో బుధవారం జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో 13 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటన పార్థివ దేహాలను తరలిస్తుండగా అంబులెన్సుకు ప్రమాదం జరిగింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను ఢిల్లీకి తరలించేందుకు గురువారం కున్నూర్ నుంచి సూలూరు ఎయిర్‌బేస్‌కు అంబులెన్సుల్లో తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కోయంబత్తూరు వద్ద ఓ అంబులెన్సు ముందుగా వెళ్తున్న మరో అంబులెన్సును అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో కొందరు పోలీసులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే ప్రమాదానికి గురైన అంబులెన్సులోని పార్థివ దేహాలను మరో అంబులెన్సులోకి ఎక్కించారు. శుక్రవారం ఢిల్లీలో బిపిన్ రావత్ అంత్యక్రియలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment