సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. కెప్టెన్ వరుణ్‌సింగ్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బిపిన్ రావత్ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న బిపిన్ రావత్‌కు వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందించారు. కానీ కొద్దిసేపటికే బిపిన్ రావత్ మృతి చెందారు. ప్రమాదంలో బిపిన్ రావత్, భార్య మధులికతో పాటు 13 మంది మృతిచెందారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉండటంతో డీఎన్‌ఏ టెస్టుల ద్వారా మృతదేహాలను గుర్తించనున్నారు.
చదవండి: (కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్: ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు)
Comments
Please login to add a commentAdd a comment