IAF helicopter crashes
-
ఆ కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా.. ప్రభుత్వ ఉద్యోగం: సీఎం
భోపాల్: డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నాయక్ జితేంద్ర కుమార్ వర్మ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఆదివారం ఉదయం ధామండ గ్రామంలో జితేంద్ర కుమార్ వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం చౌహాన్ నివాళులర్పించారు. అనంతరం చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అమర్ షహీద్ జితేంద్ర కుమార్ జీ ధమందాకే కాదు.. యావత్ దేశానికే గర్వకారణం. ఈ పుణ్యాత్ముడికి, ఆయన తల్లిదండ్రులకు, భార్యకు నేను వందనం చేస్తున్నాను' అని అన్నారు. చదవండి: (అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం) అనంతరం తన ట్విటర్ ఖాతాలో.. 'హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు జితేంద్ర కుమార్ జీకి నేను నివాళులర్పిస్తున్నాను. అతని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. అమరవీరుని భార్య, కుమార్తె సునీతను ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకుంటాం. అతని పేరు మీద ఒక పాఠశాలకు 'అమర్ షహీద్ జితేంద్ర కుమార్ విద్యాలయ' అని పేరు పెట్టడం జరుగుతుంది. ధమండ గ్రామంలో సైనికుని జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మించబడుతుంది అంటూ సీఎం చౌహాన్ ట్వీట్ చేశారు. చదవండి: (గంట వ్యవధిలో మూడు ఒమిక్రాన్ కేసులు.. థర్డ్‌వేవ్ తప్పించుకోలేమా?) కాగా, సెహోర్ జిల్లాకు చెందిన వర్మ అంత్యక్రియలు పూర్వీకుల గ్రామమైన ధమండాలో నిర్వహించారు. కార్యక్రమం మొత్తం అతని సోదరుడు దగ్గరుండి నిర్వహించాడు. ఆ సమయంలో వర్మ తండ్రి, 13 నెలల కొడుకు కూడా అక్కడే ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
విమాన ప్రమాదం అంటే గుర్తొచ్చేది బ్లాక్‌బాక్స్.. అసలు దానికథేంటి..?
విమాన ప్రమాదం జరిగిన మనకు మెదట వినిపించే పదం బ్లాక్ బాక్స్. తమిళనాడులోని కూనురు నీలగిరి కొండల్లో బుధవారం ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో చీచీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 12 మంది ఆర్మీ అధికారులు ఉన్నారు. అయితే వీరీలో బిపిన్ రావత్‌తో సహా 13 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కెప్టెన్ వరుణ్‌సింగ్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ కోసం అధికారులు వెతుకుతున్నారు. బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదంపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ క్రమంలో అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి అందులో ఏముంటుంది అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో.. ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. చదవండి: (Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు..) నిజానికి విమానాల్లో రెండు బ్లాక్ బాక్స్‌లు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ జెట్ రికార్డర్. ఇందులో విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది, ఏ దిశలో ప్రయాణిస్తుంది.. ఎంత వేగంగా ప్రయాణిస్తుంది లాంటి సమాచారం రికార్డ్ అవుతుంటుంది. రెండవది కాక్ పిట్ రికార్డర్.. అంటే విమానం నడిపే పైలెట్ తన సహ పైలెట్‌తో మాట్లాడే మాటలను, గ్రౌండ్ కంట్రోల్ రూమ్‌తో మాట్లాడే మాటలను రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ అనేది విమానానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి తనలో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది. చదవండి: (కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు) ప్రయాణ సమయాల్లో రాడార్ సిగ్నల్స్ అందకున్నప్పటికీ బ్లాక్ బాక్స్ మాత్రం పనిచేస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ విమానం వెనక భాగంలో అమర్చి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదానికి గురైనా విమానం వెనుక భాగం తక్కువగా నష్టపోతుంది. బ్లాక్ బాక్స్ అంటే నల్లగా కాకుండా ముదురు నారింజ రంగులో ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఈ బాక్స్‌ను సులభంగా గుర్తించడానికి ఈ రంగు పూస్తారు. ప్రమాద సమయానికి రెండు గంటల ముందు డాటా మాత్రమే ఇందులో ఉంటుంది. అందువలన ప్రమాదానికి ముందు ఏం జరిగిందో సులభంగా టేపుల నుంచి సేకరించిన సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. -
Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు..
సాక్షి, చెన్నై: భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్టు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బిపిన్ రావత్ ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్టు వెల్లడిచింది. చదవండి: (Bipin Rawat Chopper Crash: మృత్యువుతో పోరాడి కన్నుమూసిన రావత్) అయితే ఈ ప్రమాదంలో ఏపీ వాసి సాయితేజ్ కూడా మృతి చెందాడు. ఇతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నారు. 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు సాయితేజ్. సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. చదవండి: (Bipin Rawat: పది నిమిషాల్లో ల్యాండింగ్.. ఆ ఐదు నిమిషాల్లోనే ఘోరం!) -
'అలా చేస్తేనే ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు'
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మరికొంతమంది అధికారులు ఉన్నట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. ప్రమాదంలో 13 మంది మృత్యువాత పడ్డారు. కాగా, ప్రమాద ఘటనపై మాజీ మేజర్ శ్రీనివాస్ స్పందిస్తూ.. బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ అత్యంత సురక్షితమైది. ఇది ప్రమాదామా? లేదా ఏదైనా కుట్ర కోణమా అన్న దానిపై అన్ని కోణాల్లో విచారణ జరగాలి. హైలెవెల్ కమిటీ చేత విచారణ జరపాలి. బ్లాక్‌బాక్స్‌లో పైలెట్ సంభాషణలు రికార్డ్ అవుతాయి. బ్లాక్‌బాక్స్‌ని రికవరీ చేసి వాటిని డీ కోడ్ చేస్తే చివరి నిమిషంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో వారు మాట్లాడిన మాటలు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం జరిగింది అనేది తెలుసుకోవచ్చు' అని మాజీ మేజర్ శ్రీనివాస్ అన్నారు. చదవండి: (బిపిన్‌రావత్‌కు అత్యవసర చికిత్స.. మిగతా వారంతా దుర్మరణం) -
Bipin Rawat Chopper Crash: మృత్యువుతో పోరాడి కన్నుమూసిన రావత్
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. కెప్టెన్ వరుణ్‌సింగ్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బిపిన్ రావత్ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న బిపిన్ రావత్‌కు వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందించారు. కానీ కొద్దిసేపటికే బిపిన్ రావత్ మృతి చెందారు. ప్రమాదంలో బిపిన్ రావత్, భార్య మధులికతో పాటు 13 మంది మృతిచెందారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉండటంతో డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతదేహాలను గుర్తించనున్నారు. చదవండి: (కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్: ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు) -
Bipin Rawat: భయమంటే తెలియని.. అలుపెరగని సైనికుడు
న్యూఢిల్లీ: భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. దేశ భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న ఆయన ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాలను అణచివేయడంలో సమర్థంగా పనిచేశారు. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి దాయాది దేశం పాకిస్తాన్ గుండెల్లో దడ పుట్టించారు. సైనికుడిగా 40 ఏళ్లు నిర్విరామంగా మాతృదేశానికి సేవలందించారు. భారత సైన్యంలో ఆయన ప్రయాణం ఆసక్తికరం. అత్యున్నత అధికారిగా పైకి ఎదిగిన తీరు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. తరతరాలుగా దేశ సేవలోనే.. బిపిన్ రావత్ కుటుంబం తరతరాలుగా భారత సైన్యంలో సేవలందిస్తోంది. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ లెఫ్టినెంట్ జనరల్‌గా పనిచేశారు. బిపిన్ 1958 మార్చి 16న ఉత్తరాఖండ్ రాష్ట్రం పౌరీ గర్వాల్ జిల్లాలో జన్మించారు. డెహ్రాడూన్‌లోని కాంబ్రియన్ హాల్ స్కూల్, షిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్లో చదివారు. తమిళనాడు రాష్ట్రం వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ(డీఎస్ఎస్సీ)లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అమెరికాలో కాన్సాస్‌లోని ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లో ఉన్న యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలో హయ్యర్ కమాండ్ కోర్సు అభ్యసించారు. దేవీ అహల్యా యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తిచేశారు. 1978 డిసెంబర్ 16న 11వ గూర్ఖా రైఫిల్స్ దళానికి చెందిన 5వ బెటాలియన్‌లో సెకండ్ లెఫ్టినెంట్‌గా చేరారు. సైనికుడిగా జీవితాన్ని ఆరంభించారు. తూర్పు సెక్టార్లో భారత్–చైనా సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద విధులు నిర్వర్తించారు. తర్వాత బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. సోపోర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ 5వ సెక్టార్ అధికారిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితి మిషన్ కింద కాంగో దేశంలో మల్టీనేషనల్ బ్రిగేడ్‌లో సేవలందించారు. మేజర్ జనరల్‌గా పదోన్నతి పొందాక యూరీలోని 19వ ఇన్ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. లెఫ్టినెంట్ జనరల్‌గా దిమాపూర్, పుణేలో పనిచేశారు. 2016లో దక్షిణ కమాండ్‌లో కమాండింగ్–ఇన్–చీఫ్ జనరల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. కొన్ని నెలలకే ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా పదోన్నతి పొందారు. 2016 డిసెంబర్లో భారత సైన్యానికి 27వ అధినేతగా(ఆర్మీ చీఫ్) బాధ్యతలు నియమితులయ్యారు. బిపిన్ రావత్‌కు భార్య మధూలిక రావత్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భయమంటే ఏమిటో తెలియదు ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా రావత్‌కు ఓ పేరుంది. భయమంటే ఏమిటో ఆయనకు తెలియదని, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారని సహచరులు చెబుతుం టారు. ఆర్మీ చీఫ్‌గా, సీడీఎస్‌గా పలు సందర్భాల్లో రావత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2016 నుంచి 2019 దాకా ఆర్మీ చీఫ్‌గా జమ్మూకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. భారత్‌కు చైనా నుంచే అసలు ముప్పు పొంచి ఉందని, డ్రాగన్‌ను దీటుగా ఎదిరించడానికి మన సైనిక దళాలను బలోపేతం చేయాలంటూ ప్రభుత్వాన్ని ఒప్పించారు. చదవండి: (Bipin Rawat: పది నిమిషాల్లో ల్యాండింగ్.. ఆ ఐదు నిమిషాల్లోనే ఘోరం!) 2017లో డోక్లామ్ ఘటన కంటే ముందు ఆయన చైనా కుతంత్రాన్ని గుర్తించారు. నాగా మిలిటెంట్లను అణచివేయడానికి 2015లో భారత సైన్యం మయన్మార్ భూభాగంలోకి అడుగుపెట్టి మరీ దాడులు చేయడంలో రావత్‌దే ముఖ్యపాత్ర. పాకిస్తాన్‌పై సర్జికల్ దాడులకు స్వయంగా ప్రణాళిక రూపొందించారు. పాక్‌లోని బాలాకోట్‌లో జైషే మొహమ్మద్ నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ఫైటర్ జెట్లతో బాంబుల వర్షం కురిపించారు. 40 ఏళ్ల కెరీర్లో ఎక్కువ కాలం ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లోని ఘర్షణాత్మక ప్రాంతాల్లోనే జనరల్ రావత్ విధులు నిర్వర్తించారు. 2019లో పౌరసత్వ సవరణ చట్టంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చదవండి: (భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే) భారత సైన్యంలో అంచెలంచెలుగా.. ► సెకండ్ లెఫ్టినెంట్ 1978 డిసెంబర్ 16 ► లెఫ్టినెంట్ 1980 డిసెంబర్ 16 ►కెప్టెన్ 1984 జూలై 31 ► మేజర్ 1989 డిసెంబర్ 16 ► లెఫ్టినెంట్ కల్నల్ 1998 జూన్ 1 ► కల్నల్ 2003 ఆగస్టు 1 ► బ్రిగేడియర్ 2007 అక్టోబర్ 1 ► మేజర్ జనరల్ 2011 అక్టోబర్ 20 ► లెఫ్టినెంట్ జనరల్ 2014 జూన్ 1 ► జనరల్(సీఓఏఎస్) 2017 జనవరి 1 ►జనరల్(సీడీఎస్) 2019 డిసెంబర్ 31 -
రాజస్థాన్‌లో కూలిన యుద్ధ విమానం
జైపూర్ : రాజస్ధాన్‌లో భారత వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానం జోధ్‌పూర్ సమీపంలోని బనార్ ప్రాంతంలో మంగళవారం కుప్పకూలింది. సాంకేతిక సమస్యలతో పంటపొలంలో హెలికాఫ్టర్ కూలగా, ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. విమానం కూలిన క్రమంలో ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక బృందంతో పాటు వాయుసేన అధికారులు, పోలీసు సిబ్బంది చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. -
యూపీలో హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి బయలుదేరింది, మృతులు వివరాలు వెంటనే తెలియరాలేదు. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు. గత మూడేళ్లో 11 వైమానిక దళ హెలికాప్టర్లు కూలిపోయాయి.