ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ కూలిపోయింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి బయలుదేరింది, మృతులు వివరాలు వెంటనే తెలియరాలేదు. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు. గత మూడేళ్లో 11 వైమానిక దళ హెలికాప్టర్లు కూలిపోయాయి.