సీతాపూర్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. సీతాపూర్ జిల్లా ముసేరీపూర్ గ్రామం బయట సోమవారం రాత్రి శంభు(40), కమల(35) అనే దంపతులు ఓ చెట్టుకు విగతజీవులై వేలాడుతూ కనిపించారు. వీరు సోమవారం సాయంత్రం కాస్రేలాలోని మార్కెట్‌కు వె ళ్లారని పోలీసులు చెప్పారు. ఈ ఉదంతంపై గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ జంటది హత్యేననని బంధువులు ఆరోపించగా, వీరిద్దరి మధ్య గొడవే మరణాలకు కారణం కావొచ్చని పోలీసులు చెబుతున్నారు.