Viral Video Leaf Art Paying Tribute To CDS Bipin Rawat - Sakshi
Sakshi News home page

బిపిన్‌ రావత్‌కి వినూత్న నివాళి!... ఆకు పై ప్రతి రూపం చెక్కి!!

Published Sat, Dec 11 2021 10:01 AM | Last Updated on Sat, Dec 11 2021 11:01 AM

 Viral Video Leaf Art Paying Tribute To CDS Bipin Rawat - Sakshi

తమిళనాడులో హెలికాప్టర్‌ ప్రమాదంలో వీరమరణం పొందిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్, ఆయన భార్య మధులికకు పూర్తి సైనిక అధికార లాంఛనాలతో యావత్‌ భారత దేశం తుది వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరుణంలో చాలా మంది ప్రముఖులు, సెలబ్రెటీలు, పౌరులు ఆయనకు  ఘనంగా నివాళులర్పించారు.

(చదవండి: డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!)

అందరికంటే భిన్నంగా ఇక్కడొక వ్యకి తన కళా నైపుణ్యంతో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌కి నివాళులర్పించాడు.  ఈ మేరకు కళాకారుడు శశి అడ్కర్ అనే వ్యక్తి  రావి ఆకుపై పై బిపిన్‌ రావత్‌ ముఖచిత్రాన్ని రూపొందించి నివాళులర్పించాడు. అంతేకాదు ఆ కళాకారుడు ఆకు కళను  చేతితో భూమి నుంచి ఆకాశంలోకి చూపిస్తున్నట్లుగా పైకి లేపి వెనుక నుంచి 'తేరి మిట్టి' పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయ్యేలా ఒక వీడియోను తీసి మరీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఐపిఎస్ అధికారి హెచ్‌జిఎస్ ధాలివాల్, నటుడు అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది.

దీంతో కేంద్ర మంత్రి 'నీ కళాకృతికి సెల్యూట్‌" అని ఆ కళాకారుడిని ప్రశసిస్తూ ట్వీట్‌ చేశారు.ఈ క్రమంలో నెటిజన్లు కూడా స్పందిస్తూ...  'సీడీఎస్‌ జనరల్ శ్రీ బిపిన్ సింగ్ రావత్‌కు సెల్యూట్ ' అని ఒకరు, 'అల్విదా జనరల్ మీరు మా హృదయాలలో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు' అని మరొకరు ఇలా రకరకాలుగా ట్వీట్‌ చేశారు. ఈ మేరకు సీడిఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ భారత సైన్యం ఇక వెబ్‌ లింక్‌ని కూడా జారీ చేసింది.

(చదవండి: "సాయం" అనే పదానికి అంతరాలు ఉండవంటే ఇదేనేమో...!!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement