చెన్నై: తమిళనాడు బీజేపీ నాయకురాలు శశికళ పుష్పను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోన్ బాలగణపతి లైంగికంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డీఎంకే ఐటీ వింగ్ ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శశికళను బాలగణపతి పదే పదే తాకేందుకు ప్రయత్నించాడు. ఆమె చీర కొంగును పట్టుకునేందుకు, చేతిని ముట్టుకునేందుకు పలుమార్లు ట్రై చేశాడు. ఆమె మాత్రం ఈ చేష్టలకు ప్రతిఘటిస్తూనే ఉన్నారు.
பாஜகவில் சேரும் பெண்கள், தங்களை பாஜகவினரிடம் இருந்து தற்காத்துக் கொள்வதே பெரும் போராட்டம் தானா? @annamalai_k #ShameOnBJP pic.twitter.com/lNZXVTCKYY
— இசை (@isai_) September 13, 2022
ఈ వీడియోను సరిగ్గా చూపేందుకు స్లో మోషన్‌లో ఎడిట్ చేసింది డీఎంకే ఐటీ వింగ్. బీజేపీలో చేరే మహిళలు ఆ పార్టీ నుంచి తమను తాము కాపాడుకోవడమే అది పెద్ద సమస్యా? అని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించింది. దళిత నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఇమాన్యుయెల్ శేఖరన్ జయంతి సందర్భంగా రామనాథపురం జిల్లాలో నివాళులు అర్పించేందుకు బీజేపీ నేతలు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
అయితే డీఎంకే ఆరోపణలను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో బీజేపీ నేత ఖండించారు. బాలగణపతి వేధింపులకు పాల్పడలేదని, పుష్పగుచ్చాన్ని పట్టుకునేందుకే ప్రయత్నించారని పేర్కొన్నారు. డీఎంకే దురుద్దేశంతోనే ఈ వీడియోను ఎడిట్ చేసిందన్నారు. మరోవైపు బాలగణపతి మాత్రం ఈ వీడియోపై ఇప్పటివరకు స్పందించలేదు.
చదవండి: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment